
Donlee: సలార్, కల్కి సినిమాలతో వరుసగా హిట్లు కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్, ఆ రెండు సినిమాలను వెయ్యి కోట్ల గ్రాస్ దాటించాడు. భారతీయ సినీ చరిత్రలో వరుసగా రెండు సినిమాలను రూ. వెయ్యి కోట్లకు వసూళ్లు సాధించిన హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ రికార్డును అందుకోలేదు. ఇక భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ చిత్రాల్లో ప్రభాస్ నటించిన చిత్రాలు ఐదు ఉండడం విశేషం.
వరుస సినిమాలతో ప్రభాస్ షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు సెట్లపై ఉన్నాయి. రాబోయే మూడేళ్లు కూడా కేజీఎఫ్, సలార్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్ తో మరో మూడు సినిమాలు అగ్రిమెంట్ చేసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ర్టీగా నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పటికే చేస్తున్న సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రభాస్ నటించే ఓ సినిమాలో ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ నటించబోతున్నాడని కొద్ది నెలల క్రితం వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభాస్ స్పందించలేదు. తాజాగా ఆ ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ సలార్ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయడంతో నెట్టింట సంచలనంగా మారింది. ఆ ఇంటర్నేషనల్ స్టార్ ఎవరో కాదు.. సౌత్ కొరియా హీరో డాన్ లీ. యాక్షన్ చిత్రాల హీరోగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ సూపర్ స్టార్ ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. డాన్ లీ ప్రభాస్ కు విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం.