నార్త్ కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. దాంతో ఇద్దరు మరణించగా వందలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల కరెంట్ పోయింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.4 గా నమోదయ్యింది. డిసెంబర్ 20 న ఈ భూకంపం సంభవించింది. భూకంపం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున ఆస్థి నష్టం జరిగింది. ఇక కరెంట్ లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.