చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. 200 కు పైగా చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసిన జి.జి. కృష్ణారావు ఫిబ్రవరి 21 ఉదయం బెంగుళూర్ లో తుదిశ్వాస విడిచారు. దాంతో కృష్ణారావు కుటంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దాసరి నారాయణరావు , కె. విశ్వనాధ్ , బాపు , జంధ్యాల తదితర లెజెండ్స్ తో పనిచేసారు కృష్ణారావు.
దాసరి దర్శకత్వంలో వచ్చిన పలు సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసారు కృష్ణారావు. శంకరాభరణం , సాగర సంగమం , స్వాతిముత్యం , శుభలేఖ , బొబ్బిలిపులి , సర్దార్ పాపారాయుడు , సూత్రధారులు , సీతామాలక్ష్మి , శ్రుతిలయలు , ముద్దమందారం , నాలుగు స్తంభాలాట , సిరివెన్నెల , శుభ సంకల్పం , స్వరాభిషేకం , శ్రీరామరాజ్యం తదితర సూపర్ హిట్ చిత్రాలకు కూడా కృష్ణారావు ఎడిటర్ గా పనిచేసారు. కృష్ణారావు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.