Vijayawada : ఏపీలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ధర్మవరం నుంచి విజయవాడ వెళ్తున్న ట్రైన్.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు రాగానే ఓ బోగీ కింది భాగంలో మంటలు చెలరేగాయి. ప్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులు మంటలను గమనించి రైలులోని ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణికులు వెంటనే బయటకు దూకేశారు.
రైల్వే సిబ్బంది వెంటనే ఫైర్ ఎక్స్ టింగ్వర్స్ ను ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే సిబ్బంది విచారణ చేపట్టారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు.