
Fun Bucket Bhargav : తెలుగు యూట్యూబర్.. “ఫన్ బకెట్“ ఫేమ్ భార్గవ్‌కు విశాఖ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తనతో నటించే ఓ మైనర్ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అంతేకాకుండా బాధితురాలికి రూ. 4లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.






