‘Fun Friday’ ఎక్కడున్నా ఇంట్లో ఉంటే బోరుగా ఉంటుంది. జైల్లో ఉన్నట్లనిపిస్తుంది. అందుకే కాస్తంత రిలీఫ్ కావాలంటే బయట తిరిగితేనే వస్తుంది. ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే మెదడు కూడా మొద్దుబారిపోతుంది. ఏ ఆలోచన లేకుండా ఉంటే జడపదార్థంలా ఉండిపోవాల్సి వస్తుంది. దీంతో కాస్తంత సరదా సంతోషం కలగాలంటే బయట ప్రపంచంతో సంబంధాలు ఉండాల్సిందే. కాలక్షేపానికి అయినా అందరితో కలివిడిగా ఉండాలి. పిచ్చాపాటిగా మాట్లాడుకుంటే మనసులోని బరువు తేలికవుతుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లిన వారు ఇళ్లకే పరిమితం కాకుండా అక్కడి వారు ఓ బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేశారు. సరదా శుక్రవారం పేరుతో వ్యాపకాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ సెటిలయిన వారికి బోరు కొట్టకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సరదాగా కాఫీలు, టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మనసులోని ఆవేదన లేకుండా చేసుకుంటున్నారు.
ప్రతి శుక్రవారం హెర్న్ డన పార్కులో వీరంతా కలిసి సరదాగా గడుపుతున్నారు. కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంట్లోనే కూర్చుని విసుగు చెందకుడా ప్రకృతిలో సేద తీరుతున్నారు. ఇంకా ఇతర కుటుంబాల వారు కూడా కలిసి రావాలని కోరుతున్నారు. ప్రతి ప్రాంతంలో ఇలాంటి వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రవాస భారతయులకు కాలక్షేపం కల్పిస్తున్నారు.
హెర్న్ డన్, యాష్ బర్న్, స్టెర్లింగ్, రెస్టన్ వంటి ప్రాంతాల్లో అల్పాహారం ఏర్పాటు చేసి సరదా శుక్రవారం నిర్వహిస్తున్నారు. ప్రకృతిలో సరదాగా కాలక్షేపం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నారు. కార్యక్రమంలో భాను మాగులూరి, ఉప్పుటూరి రామ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందరిని సమన్వయ పరచి ఇలాంటి పార్టీలు చేయడంతో అందరు ఉత్సాహంగా ఉంటున్నారు.