మెగాస్టార్ కు కొడుకైనా……..
టాప్ హీరోల్లో ఒకడైనా………
ఒక్కొక్కర్ని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపు అని భారీ డైలాగ్ కొట్టి వంద మందిని ఊచకోత కోసినా…….
RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి ఆస్కార్ అవార్డ్ కోసం అమెరికాలో అడుగు పెట్టినా ………
చరిత్ర సృష్టించినా …..
భార్యతో షాపింగ్ చేసేటప్పుడు అన్నీ మూసుకొని బ్యాగ్ లు మోయాల్సిందే.
అంతేగా అంతేగా అనుకుంటూ మేడమ్ లకు జీ హుజూర్ అని అనాల్సిందే …… లోకం తీరు ఇదే…… దాంతో అదే ఫాలో అయ్యాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్.
ఆస్కార్ అవార్డ్ కోసం అమెరికా వెళ్ళాడు చరణ్. తనతో పాటుగా భార్య ఉపాసనను కూడా తీసుకెళ్లాడు. అసలే మహిళలకు షాపింగ్ అంటే పిచ్చి. అందునా అగ్ర రాజ్యం అమెరికాలో అడుగు పెడితే షాపింగ్ చేయకుండా ఎలా ఉంటారు. ఆడవాళ్ళ షాపింగ్ అంటే మాటలు కాదు సుమా! తల ప్రాణం తోక కొస్తుంది పాపం మగమహారాజులకు. అయినా భార్య షాపింగ్ చేస్తోందంటే పక్కన ఉండాల్సిందే…….. ఆ శిక్షను అనుభవించాల్సిందే.
పాపం….. చరణ్ అదే పని చేసాడు. తన భార్యమని వయ్యారంగా నడుచుకుంటూ షాపింగ్ చేస్తుంటే….. బిల్లులు కట్టుకుంటూ…… కట్టిన వాటిని మోసుకుంటూ……. ఇలా ఫోటోలకు దొరికిపోయాడు పాపం.