Ganesh Chaturthi : గణేష్ నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మన ఆనవాయితీ. గణేష్ చతుర్థి తో మొదలయ్యే ఈ ఉత్సవాలు 9 నుంచి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు భక్తులు. ప్రతీ ఊరూ, ప్రతి పట్టణం, ప్రతి వీధి గణేషుడి మంటపాలతో ఎంతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా అంతే ఉత్సాహంగా, అంతే అందంగా, ఆనందదాయకంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కటిగా గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. భాద్రపద చవితి నాడు మొదలైన ఈ ఉత్సవాలు 3, 5,7,9,11 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ.
హిందువుల పండుగలలో వినాయక చవితి విశిష్టమైనది. ఇది అందరూ జరుపుకునే పండుగ. వినాయకుడు భారీ విగ్రహాల నుండి చిన్న బొమ్మల వరకు అందరికీ అందుబాటులో ఉంటాడు. వినాయకచవితి వచ్చిందంటే ఊరువాడా ఓ పెద్ద పండుగే. పెద్ద పెద్ద మండపాలు, పూజలు ఇలా ప్రతి చోటా సందడి వాతావారణం నెలకొంటుంది. తొమ్మిది రోజుల పాటు నిత్యం పూజలందుకుంటూ భక్తులు కోరికలు తీరుస్తారు. అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ కళాభారతిలో గణేష్ చతుర్తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, తెలుగు వారు పాల్గొని పూజలు చేశారు
ఈ గణేష్ చతుర్థి వేడుకలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 6న వినాయకుడి ప్రతిష్ట పూజ నిర్వహించారు. సెప్టెంబర్ 6 నుంచి 14 వరకూ నవరాత్రులు కొనసాగాయి. సెప్టెంబర్ 7 నుంచి 13వరకు ప్రతి రోజూ పూజ, అర్చన, ప్రసాదం నిర్వహించారు. కీర్తనలు, భజనలతో తొమ్మిది రోజుల పాటు గణేషుడి సేవలో అక్కడి భక్తులు తరించారు. సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ‘ద మాల్ ఎట్ ఓక్ ట్రీ’, ఓక్ ట్రీ రోడ్, న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో వరుసగా 22వ సంవత్సరం ఈ గణపతి చతుర్థి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. తొమ్మిది రోజలు పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు 14వ తారీఖున ఆరు గంటలకు నిమజ్జానికి బయలు దేరారు. గణేషుడి భారీ సంఖ్యలో అక్కడి భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లి గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు. అక్కడి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ (732) 515-4872, www.kalabharathiusa.org లో చూడొచ్చు.
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director )
More Images : Kalabharathi Ganesh Chathurthi 2024 Oak Tree Rd NJ Nimajjanam Photos.