గూగుల్ తన సంస్థలో పనిచేస్తున్న 10 వేల మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ పని తీరు ఆశించినస్థాయిలో లేకపోవడంతో 10 వేల మందిని తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే గూగుల్ లో ఆల్ఫాబెట్ కింద 1,87, 000 మంది పని చేస్తున్నారు. ఇందులో 10 వేల మందిని తొలగించడానికి వాళ్ళ పని ఆధారంగా ర్యాంక్ లను కేటాయించే పనిలో పడ్డారు.
ఇలా ర్యాంక్ లను కేటాయించిన తర్వాత ఉద్యోగులను తొలగించే ప్రక్రియ వేగవంతం చేస్తుందట. ఆర్ధిక మాంద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను కుదించుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే పలు సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. కాగా ఇప్పుడు ఆ వంతు గూగుల్ చేయనుంది. అత్యల్ప ర్యాంక్ వచ్చిన ఉద్యోగులను తొలగించనుంది. దాంతో పెద్ద మొత్తంలో రోడ్డున పడనున్నారు.