Helena disaster : హరికేన్ హెలెనా ఆగ్నేయ అమెరికాలో విధ్వంసం సృష్టిస్తోంది. తుపాను కారణంగా కనీసం 44 మందు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 15-26 బిలియన్ డాలర్ల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో కేటగిరి-4 హరికేన్ ప్రభావం అధికంగా ఉందన్నారు. హెలెనా తుపాను కారణంగా దాదాపు 44 మంది మృతి చెందగా.. అందులో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, ఒక మహిళ, నెల వయసున్న చిన్నారి సైతం ఉన్నట్లు వెల్లడించారు. జార్జియాలోని పలు ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. యునికోయ్ కౌంటీ ఆసుపత్రిని వరదలు ముంచెత్తడంతో హెలికాప్టర్ సహాయంతో 54 మందిని రక్షించినట్లు వెల్లడించారు.
Breaking News