
Tirumala : తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరో ప్రభాస్ నేడు దర్శించుకున్నారు. వేకువజామునే సాంప్రదాయ దుస్తుల్లోప్రభాస్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. సుప్రభాత సేవలో ప్రభాస్ పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులను పొందారు.

అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్ధ ప్రసాదాలను ప్రభాస్ కు అందజేశారు. కాగా పురాణ ఇతిహాసాల నేపథ్యంలో తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.






