Akshay Kumar: ఇటీవల రిలీజ్ అయిన ‘ఓ మై గాడ్ 2’ రోజు రోజుకు వివాదాలను మూట గట్టుకుంటోంది. ఈ సినిమా ఇలానే ప్రేక్షకుల ముందుకు వెళ్తే సమాజంలో కలతలు సృష్టిస్తుందని సెన్సార్ బోర్డ్ సూచనలు చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వరకు తప్పులను చూపెట్టింది. వీటిని మారిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని స్పష్టం చేసింది కానీ ఏమైందో ఏమోగానీ A సర్టిఫికెట్ ఇచ్చింది.
దీంతో నిర్మాతలు ఆగస్ట్ 11న థియేటర్లలోకి రిలీజ్ చేశారు. రిలీజ్ కావడంతోనే మూవీ చూట్టూ తీవ్ర వివాదాలు రావడం మొదలైంది. హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సున్నితమైన అంశాన్ని అదీ భగవంతుడికి ముడిపెట్టి మరీ సినిమా తీశారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక సారి స్టోరీని పరిశీలిస్తే.
హీరో పంకజ్ త్రిపాఠి విపరీతమైన శివ భక్తుడు. తన కొడుకును ఒక కారణం చేత స్కూల్ యాజమాన్యం బహిష్కరిస్తుంది. కారణం బయటకు పొక్కడంటే సమాజంలో చీత్కారం ఎదుర్కొంటాడు పంకజ్ త్రిపాఠి. తాను ఉంటున్న ఇంటిని విడిచిపెట్టి వెళ్లాలని అనుకుంటాడు. ఇంటిని విడిచి మరో ఊరికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్ వెళ్లడంతో అక్కడకు శివుడి ధూతగా అక్షయ్ కుమార్ వస్తాడు. ఆయనకు బోధ చేసి దీనిపై పోరాడాలని సూచిస్తాడు.
ఆయన సూచనల మేరకు పంకజ్ త్రిపాఠి కోర్టులో దావా వేస్తాడు. తన కొడుకుకు సెక్స్ పట్ల ఎటువంటి అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి పనికి పాల్పడ్డాడని, అందుకే పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ తప్పకుండా ఉండాలని దావా వేశాడు. ఇక దీనిపై కోర్టులో వాదనలు కొనసాగుతాయి. అందులో అక్షయ్ కుమార్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు.
శివుడితో పాటు శివ భక్తులను అవమానించేలా సినిమా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రీయ హిందూ పరిషత్ అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపింది. ఈ సినిమా షోలను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఆగ్రాకు చెందిన ఒక హిందూ సంస్థ అక్షయ్ కుమార్‌ను చెంపదెబ్బ కొట్టిన వారికి నగదు బహుమతి ఇస్తామని కూడా ప్రకటించింది.
సినిమా విడుదలకు ముందే వివాదాలు తెచ్చిపెట్టింది. CBFC సినిమాకు 16 కట్లను సూచించడమే కాకుండా A సర్టిఫికెట్ ఇచ్చింది. మైనర్లు సినిమా చూడకుండా నిషేధించింది. ఓ మై గాడ్ 2కు అమిత్ రాయ్ దర్శకత్వం వహించాడు. యామీ గౌతమ్, గోవింద నామ్‌దేవ్, పవన్ మల్హోత్ర, బ్రిజేంద్ర కాలా కీలక పాత్రల్లో కనిపించారు. రుణా భాటియా, రాజేశ్ భల్, విపుల్, అశ్విన్ వాద్రా నిర్మాతలుగా వ్యవహరించారు.