మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో బాగుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలున్నాయి. ధనలక్ష్మిని పూజించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి వారికి పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మాట పట్టింపులకు పోతే నష్టాలే వస్తాయి. ఆంజనేయుడిని కొలవడం మంచిది.
సింహ రాశి వారికి సంతృప్తికరమైన ఫలితాలున్నాయి ఒక వార్త మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. శని శ్లోకం చదువుకుంటే ఇంకా మంచి ఫలితాలు రావడం ఖాయం.
కన్య రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఎవరికి కూడా నమ్మి డబ్బులు ఇవ్వకండి. ప్రయాణాల్లో మెలకువగా ఉండండి. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.
తుల రాశి వారికి శ్రమ పెరిగినా పనులు పూర్తి చేయండి. పై అధికారులతో జాగ్రత్త. అందరితో ప్రేమగా ఉండండి. ఈశ్వరారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృశ్చిక రాశి వారికి మంచి ఆలోచనలు వస్తాయి. పనిభారం ఎక్కువ అయిన విజయాలు అందుకుంటారు. చంద్ర ధ్యాన శ్లోకం చదవడం వల్ల శుభాలు కలుగుతాయి.
ధనస్సు రాశి వారికి అన్నింట్లో కలిసి వస్తుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలలో బాగుంటుంది. లక్ష్మీగణపతిని కొలిస్తే మంచిది.
మకర రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. అనవసర విషయాల జోలికి వెళ్లకండి. దుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
కుంభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసర కోపాన్ని దరిచేరనీయొద్దు. లక్ష్మీ అష్టకం చదివితే మంచిది.
మీన రాశి వారికి విజయాలు దక్కుతాయి. ఇతరులతో చనువుగా ఉండకండి. మీ పరిధి దాటి వెళ్లకండి. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలు తెస్తుంది.
ReplyForward
|