ధైర్యవంతుడు ఎదురుగా నిలబడితే ఆ దెబ్బకు చంద్రబాబు ఎక్కడా నిలబడకుండా పారిపోయి మీడి యాను ముందర పెట్టి రాజకీయం చేస్తాడని లక్ష్మిపార్వతి అన్నారు. గతం లో రాష్ట్రంలో చంద్రబాబు అసమర్ధ పరిపాలన చేశాడని అతడికి పరిపాలన అంటే ఏంటో కూడా తెలియదని ఆమె అన్నారు. రాజకీయాల్లో చంద్రబాబుకు ఓనమాలు కూడా తెలియవవి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ పూర్తి స్వరూపం ఆయనకు తెలియదు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా గా గతంలో పనిచేశాడు కదా ఏపి భౌగోళిక స్వరూపం ఏంటో చంద్రబాబు నేటికి తెలియదని ఏ మూలన ఏది ఉందో కూడా చంద్రబాబు తెలియదన్నారు. చంద్రబాబు తెలిసిందల్లా ఏక్కటే కేంద్రం నుంచి వచ్చిన డబ్బున దారిమళ్లించడం మాత్రం బాగా తెలుసు అన్నారు. లక్ష 2o వేల కోట్ల రూపాయలను ఆనాడు చంద్రబాబు దారి మళ్లించారని లక్ష్మి పార్వతి ఆరోపించారు. తండ్రి ,కోడుకు ఇద్దరు కలిసి ఏపిలో అవినీతికి పాల్పడ్డారని ఆమె అన్నారు. స్కిల్ స్కాం మెదలు కోని ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు ఎన్నో స్కాంలు చేశారని ఆమె అన్నారు.
లక్ష్మీపార్వతితో JAISWARAAJYA TV ఇంటర్వ్యూ వీడియోను కింద వీడియోలో చూడొచ్చు.