
Cyclone Biparjoy : బిపోర్ జాయ్ తుఫాన్ ముంచుకొస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రేపు సాయంత్రం గుజరాత్ లోని జకావు పోర్ట్ వద్ద తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు గుజరాత్ లోని సౌరాష్ట్ర.. కచ్ తీరాలకు.. రాజస్థాన్ కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసి అప్రమత్తం చేసింది.
బిపోర్ జాయ్ తుఫాను గుజరాత్ ను వణికిస్తుండగా.. రాజస్థాన్ లోనూ 12 జిల్లాల్లో తీవ్రంగా ఉండనుంది. ద్వారక.. పోర్‌బందర్.. జామ్‌నగర్, రాజ్‌కోట్.. జునాఘర్.. గిర్-సోమ్‌నాథ్ వద్ద 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తుఫాను అలర్ట్ నేపథ్యంలో గుజరాత్‌లోని తీర ప్రాంతాల్లో నివసించే 38వేల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్.. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తీర ప్రాంతాల్లో ప్రభుత్వం సిద్ధం ఉంచింది.
తుఫాను బాధితులకు రోజువారి నిత్యవసరాలను సరుకులు అందేలా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్వహించిన సమావేశంలో గుజరాత్ ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారులు వెల్లడించారు.






