35.3 C
India
Friday, April 19, 2024
More

    Keerthy Suresh కి గాయాలు.. ఇంతకీ ఏమైంది?

    Date:

    keerthy suresh
    keerthy suresh

    Keerthy Suresh Injuries : కీర్తి సురేశ్ మొహంపై గాయాలు ఉండడంతో తన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘మహానటి’గా సావిత్రి అభిమానులకు సైతం ఆమె ఫ్యాన్ గా మారారు. అంతటి మహానటిని మరిపించేంతలా నటించిందంటూ కీర్తించారు. ఆమెను నేటితరం మహానటి అంటూ విపరీతంగా అభిమానిస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇటీవల ఆమె మొహంపై గాయాలైన ఒక వీడియోను ఆమె ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసింది. ఆమె ఎడమ కంటికి కింది భాగంలో తీవ్రంగా గాయమైంది. దీంతో ఆమె అభిమానులు వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ‘అసలు కీర్తికి ఏమైంది’ అంటూ పోస్టులపై పోస్టులు పెడుతున్నారు.

    ఇది గమనించిన కీర్తి సురేశ్ తన అభిమానులను ఇంకా టెన్షన్ పెట్టకుండా అసలు విషయం చెప్పింది. తను షూటింగ్ కోసమే ఈ మేకప్ వేసుకున్నట్లు స్పష్టం చేసింది కీర్తి. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సాని కాయిదం’. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించారు. గత సంవత్సరం 6 మే, 2022న అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలైంది. ఈ మూవీ వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె ఈ వీడియోను సోషల్ మీడియా వేధికగా, ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణలో ఆమె పడిన శ్రమను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ‘సాని కాయిదం’ మూవీలో ఆమె డెడికేషన్ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

    keerthy suresh
    keerthy suresh

    ఎలాంటి పాత్రల్లో నైనా ఇట్టే ఒరిగిపోయే నటి కీర్తి సురేశ్. తన మొదటి సినిమా నుంచి ఆమె ప్రూవ్ చేసుకుంటూ వస్తూనే ఉంది. కానీ ఆమె కెరీర్ పూర్తిగా మలుపుతిప్పింది మాత్రం ‘మహానటి’. విలక్షణ నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది కీర్తి. ఈ మధ్య ఆమె నటించిన సినిమా ‘దసరా’ బాక్సాఫీస్ హిట్లు సాధించింది. దేశ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లపై రిలీజైన మూవీగా నిలిచింది. ఇందులో వెన్నెల పాత్రను పోషించిన కీర్తి సురేశ్ మనో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ పాత్రకు ఆమె విపరీతమైన ప్రశంసలు అందుకుంది.

    ఇక ఆమె తర్వాతి ప్రాజెక్టు మెగాస్టార్ తో కలిసి ‘భోళా శంకర్’లో నటిస్తుంది. చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది కీర్తి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆమె ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. దీన్ని ఆమె అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. తమిళ ‘వేదాళం’కు ఈ సినిమా రీమేక్. మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. సంగీతాన్ని మహతి సమకూరుస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Sita Rama : ఆ కొబ్బరి చెట్ల మాటున సీతారాములు.. చూసి తరించండి

    Sita Rama : భారత సంస్కృతిలో, భారతీయుల జీవన విధానంలో సీతారాముల...

    Vasantha Krishnaprasad : వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

    Vasantha Krishnaprasad : వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని...

    Nominations in AP : ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keerthy Suresh Gorgeous Look : చీరలో సోయగాల విందు పెడుతున్న కీర్తి సురేష్.. కిరాక్ అందం!

    Keerthy Suresh Gorgeous Look : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు...

    Keerthy Suresh : పైట పక్కకు జరిపి.. బరువైన అందాలతో కీర్తి సురేష్ అందాల విందు..!

    Keerthy Suresh : కీర్తి సురేష్ అంటే నటనకు పెట్టింది పేరు. ఆమె...

    Keerthy Suresh Gorgeous Look : లావెండర్ చీరలో మెరుస్తున్న కీర్తి సురేశ్.. మామూలుగా లేదుగా!

    Keerthy Suresh Gorgeous Look : పరిచయం అక్కర్లేని హీరోయిన్ కీర్తి...

    Keerthy Suresh : ఓనం పండుగకు మెరిసిపోతున్న కీర్తి సురేష్.. అమ్మడి లుక్ కు అంతా మెస్మరైజ్!

    Keerthy Suresh : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు రాష్ట్రాలకు...