
ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
నేటి పరీక్ష కోసం సెట్ సీ పరీక్ష పత్రాన్ని ఎంపిక చేసిన ఇంటర్ బోర్డు అధికారులు
ఇంటర్మీడియెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు.
ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పరీక్షలు.
విద్యార్థులు 8.30 గంటల వరకు సెంటర్ లోకి రావాలని విజ్ఞప్తి.
1473 పరీక్షా కేంద్రాలు.
26,333 మంది ఇన్విజిలెటర్స్
200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు
ఈ ఏడాది పరీక్షలు రాయనున్న
9,47,699 లక్షల మంది విద్యార్థులు.
పరీక్ష కేంద్రాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరిన ఇంటర్ బోర్డు.
పరీక్ష కేంద్రాలకు విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను కోరిన ఇంటర్ బోర్డు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలు సీల్ తీయడం, జవాబు పత్రాలు ప్యాక్ చేస్తామన్న అధికారులు.
హల్ టికెట్స్ నేరుగా విద్యార్థులే డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు.
హాల్ టికెట్ పై పేరు, సబ్జెక్ట్స్ పరిశీలించుకోవాలని విద్యార్థులకి సూచన.
ఇన్విజిలేటర్స్ కి కూడా పరీక్ష హాల్లోకి సెల్ ఫోన్స్ అనుమతి లేదన్న అధికారులు.
ఎగ్జామ్ ప్యాడ్ చూపిస్తే ఆర్టీసి బస్సు ఆపాలని సూచనలు ఇచ్చిన బోర్డు అధికారులు.
పరీక్షా కేంద్రాల వైపు ఎక్కువ బస్సులు తిరిగేలా ఏర్పాట్లు.
విద్యార్థుల కోసం కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.
మాల్ ప్రాక్టీస్ చర్యలపై కటిన చర్యలు తీసుకుంటామన్న బోర్డు సెక్రెటరీ.
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు 4,82,677
ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేవారు 4,65,022.
మొత్తం ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేవారు 9,47,699.
మంది విద్యార్థులు
రాష్ట్రంలో 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు.
ప్రభుత్వ రంగ కాలేజీలు 614, ప్రయివేటు జూనియర్ కాలేజీలు 859.
రాష్ట్రంలో 1,473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు,
పరీక్షల నిర్వహణ కోసం 75 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్.
పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతోపాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు.
పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉంచాలని కోరిన బోర్డు అధికారులు.
పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులను ఆదేశించిన బోర్డు సెక్రెటరీ.
పరీక్షల నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు.
పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేలా చర్యలు.