ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, విపక్షాలు ఎన్నికల వార్ కు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య వార్ గట్టిగానే సాగుతున్నది. మధ్యలో జనసేన కూడా తన ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే రాజమండ్రిలో సోమవారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరు నేతల పర్యటనతో ఇప్పుడు రాజమండ్రి వేడెక్కింది. అధికారులు, పోలీసులు, నేతల్లో హైటెన్షన్ నెలకొంది. రాష్ర్టంలో రెండు పార్టీ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. అదనపు బలగాలను అందుబాటులో ఉంచినట్లు సమాచారం. రాష్ర్టంలో ప్రధాన నేతలిద్దరూ రాజమండ్రికి వస్తుండడంతో అందరి చూపు రాజమండ్రి వైపు మళ్లింది.
ఇద్దరూ ఒకేరోజు..
సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సోమవారం రాజమండ్రిలో బస చేయనున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం లోని కూనవరం మండలం లో పర్యటించనున్నారు. మరోవైపు చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరానికి చంద్రబాబు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఆయన చింతలపూడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పట్టిసీమకు చేరుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అక్కడే ఎత్తిపోతలను పరిశీలిస్తున్నారు. ఇక అక్కడి నుంచి పోలవరం వెళ్తారు. ఇక సీఎం జగన్ కూడా గోదావరి జిల్లాల పర్యటనకు వస్తున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకుంటారు. గొమ్ముగూడెం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. ఇక చంద్రబాబు కూడా రాత్రికి రాజమండ్రిలో బస చేయనున్నారు.
రాజమండ్రిలో ఉత్కంఠ
ఏపీలో కీలక నేతలిద్దరూ రాజమండ్రిలో బస చేస్తుండడంతో అధికారులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. పుంగనూరు ఘటన తర్వాత రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అయితే బీవీఆర్ ఫంక్షన్ హాలులో చంద్రబాబు, ఆర్అండ్ బీ గెస్ట్ హౌజ్ లో సీఎం జగన్ బస చేయనున్నారు. ఇక మంగళవారం ఉదయం చంద్రబాబు సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కొరుకోండ లో బహిరంగ సభకు వెళ్తారు. మంగళవారం రాత్రికి విశాఖ పట్నం చచేరుకుంటారు. జగన్ కోనసీమలోని గురజాపులంక, తానేలంక రామాలయం పేట, తోటరాముడివారిపేట తదితర గ్రామాల్లో పర్యటించి మంగళవారం మధ్యాహ్నానికి తాడేపల్లి చేరుకుంటారు.