25.9 C
India
Monday, December 15, 2025
More

    NEET Paper Leak Case : నీట్ పేపర్ లీక్ కేసులో.. జార్ఖండ్ జర్నలిస్టు అరెస్టు

    Date:

    NEET Paper Leak Case
    NEET Paper Leak Case

    NEET Paper Leak Case : నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ అంశం పార్లమెంట్ ను సైతం కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజీలో జార్ఖండ్ లోని ఓ జర్నలిస్టుకు సంబంధలున్నాయని సీబీఐ శనివారం అరెస్టు చేసింది. జార్ఖండ్ లోని హజారీబాగ్ కు చెందిన జమాలుద్దీన్ అనే జర్నలిస్టు ఓ హిందీ న్యూస్ పేపర్ లో పనిచేస్తున్నాడు. నీట్ పేపర్ లీకేజీలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కు సాయం చేసినట్లు అభియోగాలు రావడంతో అతన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది.

    అయితే, ఇప్పటికే ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ ఆలంలను శుక్రవారం సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు ఈ కేసులో ఈరోజు సీబీఐ బృందాలు గుజరాత్ లో గోద్రా, ఖేడా, అహ్మదాబాద్, ఆనంద్ వంటి వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఆధారంగా గోద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో జూన్ 27న మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NEET exam : నీట్ పరీక్ష రాసిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి.. ఫలితం ఇదే..

    NEET exam : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ చదువు తప్పనిసరి....

    NEET : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నీట్ సెగ

    -  ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు NEET : కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ...

    NEET Exam Results : నీట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్.. తమిళనాడు విద్యార్థికి కూడా.

    NEET Exam Results :  దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ఫలితాలు మంగళవారం...