
ఆహ్వార్యం.. అభినయం.. రూపం అన్నీ తాత నుంచి పునికి పుచ్చుకుంటున్నట్లు ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. అందుకే ఆయనంటే యంగ్ తరానికే కాదు. తాతను అభిమానించిన వారికి కూడా అభిమానమే. తాత, తండ్రుల బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి వచ్చినా తనదైన గుర్తింపుతో అగ్ర నటుడిగా నిలిచాయి. తారక్ చేసిన ప్రతీ సినిమా ఒక బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. క్యారెక్టర్ ఎలాంటిదైనా ఆయన పరకాయ ప్రవేశం చేస్తారు. ఆయన అభిమానులు కూడా ఆయనను తాతతో పోలుస్తూ కీర్తిస్తారు.
యంగ్ టైగర్ చైల్డ్ ఆర్టిస్ట్ అనే చెప్పాలి. ఏడేళ్ల వయస్సు నుంచి ఆయన సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన మొదటి సినిమా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. 1991లో ఈ మూవీ రిలీజై ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఆ తర్వాత తాత సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో చేశారు. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. ఇక గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాల రామాయణంలో రాముడిపాత్రలో కనిపించారు. ఇది ఉత్తమ చిత్రంగా 1997లో జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
ఆ తర్వాత హీరోగా రాఘవేందర్ దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 తీశారు. ఆయనకు కెరీర్ లో పడిన తొలి అడుగే విజయం సాధించిందని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత చూడాలని ఉంది.. ఇలా ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’. ఇలా ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మొదట్లో బొద్దుగా ఉన్న తారక్. ఆ తర్వాత చాలా స్లిమ్ గా మారారు. ‘యమదొంగ’ నుంచి ఆయన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఇక ఆయన చివరి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కు ఆస్కార్ అవార్డులు రావడంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు తారక్. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను కూడా గతంలో విడుదల చేశారు.