27.7 C
India
Saturday, May 17, 2025
More

    Kalki 2898 AD Craze in New Jersey : న్యూజెర్సీలో ‘కల్కి’ క్రేజ్..న్యూజెర్సీ థియేటర్లలో మనోళ్ల జోష్!

    Date:

    Kalki 2898 AD Craze in New Jersey
    Kalki 2898 AD Craze in New Jersey

    Kalki 2898 AD Craze in New Jersey : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీకి అమలాపురం నుంచి అమెరికా దాక మాములు క్రేజ్ లేదు. అమెరికాలో ప్రీమియర్ షోలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. 26న స్పెషల్ ప్రీమియర్ షోలతో నార్త్ అమెరికాలో కల్కి మూవీ ఆడియన్స్ ముందుకొచ్చింది.

    భారీ అంచనాల మధ్య థియేటర్స్ లలోకి వచ్చిన కల్కికి అడ్వాన్స్ బుకింగ్స్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. కాగా, రెండు వారాల ముందుగానే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కల్కి మూవీకి మొదటి నుంచి హైప్ ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్సే కాదు సగటు సినీ అభిమానులు మొదటి రోజే చూడాలని ఫిక్స్ అయ్యారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

    బాహుబలి మూవీతో వరల్డ్ వైడ్ మార్కెట్ పెంచుకున్న ప్రభాస్ నుంచి వస్తున్న ప్రతీ సినిమా వందల కోట్ల బిజినెస్ చేస్తోంది. గతేడాది వచ్చిన సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ కు ‘కల్కి’ లైఫ్ లో మరిచిపోలేని సినిమా అవుతుందని అంటున్నారు. ఈ మూవీలో ప్రభాస్ తో పాటు పాన్ ఇండియా ప్రముఖ తారలు నటిస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పడుకునే, దిశ పటానీ..ఇతర ఎంతో మంది దక్షిణాది, ఉత్తరాది నటులు నటిస్తుండడంతో ఆంధ్రానే కాదు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తీవ్ర ఆసక్తి కనబరిచారు.

    అమెరికాలోని న్యూజెర్సీ లోని రీగల్ 18 థియేటర్స్ లో ఫస్ట్ డే ఫస్ట్ షోలో తెలుగు వాళ్ల సందడి మాములుగా లేదు. యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి తమ సహచర మిత్రులతో కలిసి థియేటర్ లో సందడి చేశారు. థియేటర్ లో వారు చేసిన సందడి చూస్తే ఆంధ్రాలో ఉన్నామా? అమెరికాలో ఉన్నామా? అనే సందేహం రాక మానదు.

    కల్కి మూవీ ఎంజాయ్ మెంట్ ను సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు తీసి తమ వాళ్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కల్కి సినిమా ద్వారా తెలుగు సినిమా స్టామినా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. తెలుగు హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల పనితనం హాలీవుడ్ కు దీటుగా ఉండడం శుభపరిణామమన్నారు. కల్కి సినిమా బాగుందని.. ప్రభాస్, అమితాబ్ నటన హైలెట్ అని, విజువల్స్ నెక్ట్స్ లెవల్ అని, క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించిందని వారు చెప్పుకొచ్చారు.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Jersey : న్యూ జెర్సీలోని జైస్వరాజ్య/JSW టీవీ స్టూడియోస్ శ్రావణ సందడి

    New Jersey : తెలుగు వారు ఎక్కడున్నా.. సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు,...

    CM Revanth : ప్రపంచంతోనే తెలంగాణ పోటీ : న్యూజెర్సీలో సీఎం రేవంత్

    CM Revanth in Newjersey : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి...

    Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..  అనుకున్న దానికంటే ముందుగానే ఆ  మూవీ సీక్వెల్

    Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి...