బ్రేకింగ్ న్యూస్…… తెలంగాణ ముఖ్యమంత్రి, BRS జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 10 న తెలంగాణ భవన్ లో BRS పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు కేసీఆర్. ఈ సమావేశానికి ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు, జెడ్పీ చైర్మన్లు , పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం మొత్తంగా కీలక నాయకులు అందరూ ఈ సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. కవిత ను అరెస్ట్ చేస్తే పార్టీ పరంగా తెలంగాణ అంతటా ధర్నాలు , రాస్తారోకోలు నిర్వహించడానికి సర్వ సన్నద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్ కు నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. కవిత ను అరెస్ట్ చేస్తే తెలంగాణ స్తంభించేలా మాస్టర్ ప్లాన్ కు కేసీఆర్ సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.