Kodali Naren అమెరికాలో తెలుగు వారి సంఘం(తానా) 2023 మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ మహాసభల్లో తానా కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ కొడాలి నరేన్ ఎన్నికయ్యారు. ఆయన ఎంపిక పట్ల తెలుగు ఎన్ఆర్ఐలు.. ప్రవాసీ భారతీయులు.. తానా నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
వర్జీనియాలోని సతీష్ వేమన ఇంటి ఆవరణంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూబ్లడ్ కన్వీనర్ నాగభూషణం పాతూరి, తదితరులుపాల్గొన్నారు.
వీడియో ను కింద చూడొచ్చు