Lal Salaam Movie Shooting Complete in Rajni’s style : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం “లాల్ సలామ్’. ఈ మూవీని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో రజనీ కాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో రజనీ కాంత్ తన పాత్రకు సంబంధించి షూటింగ్ ను తాజాగా పూర్తి చేశారు.
ఈ విషయాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ ‘లాల్ సలామ్’ యూనిట్ కలిసి పంచుకున్నారు. ఈమేరకు చిత్రయూనిట్ తో ఆయన దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ‘లాల్ సలామ్’ చిత్రంలో రజనీకాంత్ మొయిదీన్ బాయ్ అనే పాత్రలో నటిస్తున్నారు.