ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగానే సమయం ఉంది. అయినప్పటికీ అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. 2024 మర్చి లేదా ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీకి అలాగే పార్లమెంట్ కు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే దానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికార వైసీపీ , ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం , జనసేన , బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాడాలని సిద్ధమయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో యుద్ధ వాతావరణమే నెలకొంది.
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా రాజకీయ పార్టీలు తమ పరిస్థితి ఎలా ఉందో సర్వేలు చేయించుకోవడం సర్వసాధారణం. అలాగే పలు సంస్థలు కూడా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ….. ఉంటుంది. ఏ పార్టీ అధికారం చేపట్టబోతోంది తదితర వివరాలను సమగ్రంగా ఇస్తుంటాయి. ఆ కోవలోనే ” శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ ” SAS అనే సంస్థ ఏపీలో పెద్ద ఎత్తున సర్వే చేపట్టింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 330 కి పైగా శాంపిల్స్ ను మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సేకరించింది. మూడు దశల్లో ఈ సమగ్ర సర్వే జరిగింది.
2022 సెప్టెంబర్ లో మొదటి దశ జరుగగా నవంబర్ 2022 నుండి 17 ఫిబ్రవరి 2023 వరకు మలిదశ సర్వే నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో అత్యధికంగా శాంపిల్స్ ను సేకరించడమే కాకుండా 18 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళ నుండి మొదలుకొని 50 ఏళ్లకు పైబడిన వాళ్ళ వరకు అన్ని తరగతుల వాళ్ళ దగ్గర నుండి శాంపిల్స్ సేకరించారు. రైతులు , మహిళలు , వీవర్స్ సెక్షన్ , దళితులు , మైనారిటీ , క్రిస్టియన్ , బీసీలు , ప్రభుత్వ ఉద్యోగులు , ప్రయివేటు ఉద్యోగులు , వ్యాపారస్తులు ఇలా అన్ని వర్గాల నుండి సేకరించిన శాంపిల్స్ తో సమగ్ర రిపోర్ట్ ఇచ్చింది శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్.
శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ సమగ్ర సర్వే ప్రకారం జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందో ఫలితాలు ఇలా ఉన్నాయి.
1) శ్రీకాకుళం జిల్లా : మొత్తం 10 స్థానాలు
టీడీపీకి 6 స్థానాలు దక్కుతున్నాయి . 1) ఇచ్ఛాపురం 2) ఇచ్చెర్ల 3) పాతపట్నం 4) రాజాం 5) పలాస 6) ఆముదాలవలస
ఇక వైసీపీకి 2 స్థానాలు మాత్రమే ద్కకుతున్నాయి. 1) పాలకొండ 2 ) నరసన్నపేట
అయితే టెక్కలి , శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాల్లో మాత్రం టీడీపీ – వైసీపీ నువ్వా – నేనా అన్నట్లుగా ఉంది పరిస్థితి.
2) విజయనగరం జిల్లా : మొత్తం 9 స్థానాలు
టీడీపీకి 4 స్థానాలు లభిస్తున్నాయి. అవి 1) విజయనగరం , 2 ) బొబ్బిలి 3) ఎస్. కోట 4) గజపతి నగరం
వైసీపీకి మూడు స్థానాలు దక్కుతున్నాయి. అవి 1) చీపురుపల్లి 2) నెల్లిమర్ల 3 ) సాలూరు
ఇక మిగిలిన రెండు స్థానాలు పార్వతీపురం , కురుపం లలో నువ్వా – నేనా అన్నట్లుగా ఉంది పరిస్థితి.
3) విశాఖపట్టణం జిల్లా : మొత్తం స్థానాలు 15
ఇక్కడ టీడీపీ 7 స్థానాలు గెలుపొందుతోంది. అవి 1) విశాఖపట్నం ఈస్ట్ 2) విశాఖపట్నం వెస్ట్ 3) భీమిలి పట్నం 4) పెందుర్తి 5) అనకాపల్లి 6) చోడవరం 7 ) నర్సీపట్నం
ఇక వైసీపీకి 5 స్థానాలు దక్కుతున్నాయి. అవి 1) విశాఖపట్నం సౌత్ 2) విశాఖపట్నం నార్త్ 3) యలమంచిలి 4) అరకు 5) పాడేరు
మిగిలిన మూడు స్థానాలు పాయకరావు పేట , గాజువాక , మాడుగుల లలో టీడీపీ – వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉంది పోటీ.
4) ఈస్ట్ గోదావరి జిల్లా : మొత్తం 19 స్థానాలు.
ఇందులో టీడీపీ కేవలం 6 స్థానాలు మాత్రమే దక్కించుకుంటోంది. అవి 1) పెద్దాపురం 2) ప్రత్తిపాడు 3) జగ్గంపేట 4) అమలాపురం 5) ముమ్మిడివరం 6 ) రాజమండ్రి అర్బన్
వైసీపీ కూడా 6 స్థానాలు దక్కించుకుంటోంది. అవి 1) రామచంద్రపురం 2) రంపచోడవరం 3) కాకినాడ అర్బన్ 4) అనపర్తి 5) తుని 6) రాజానగరం
ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన 4 స్థానాలు దక్కించుకుంటోంది. అవి 1) పిఠాపురం 2) రాజమండ్రి రూరల్ 3) రాజోలు 4) కొత్తపేట
ఇక మిగిలిన మూడు స్థానాలు గన్నవరం , మండపేట , కాకినాడ రూరల్ లలో భీకర యుద్ధం జరుగుతోంది.
5) వెస్ట్ గోదావరి జిల్లా : మొత్తం స్థానాలు 15
అందులో టీడీపీ 8 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తోంది. అవి 1) పాలకొల్లు 2) ఆచంట 3) ఉంగుటూరు 4) దెందులూరు 5) తణుకు 6) కొవ్వూరు 7 ) పోలవరం 8) ఉండి
వైసీపీ ఇక్కడ 2 స్థానాలు మాత్రమే గెలుపొందుతోంది అవి 1) ఏలూరు 2) గోపాలపురం
ఇక జనసేన 3 స్థానాల్లో విజయం సాధిస్తోంది అవి 1) భీమవరం 2) నర్సాపురం 3) తాడేపల్లి గూడెం
అయితే నిడదవోలు , చింతలపూడి లలో టఫ్ ఫైట్ కొనసాగనుంది.
6) కృష్ణా జిల్లా : మొత్తం 16 స్థానాలు
టీడీపీ ఇక్కడ 8 స్థానాల్లో విజయం సాధిస్తోంది అవి 1) విజయవాడ ఈస్ట్ 2) విజయవాడ సెంట్రల్ 3) జగ్గయ్యపేట 4) పెనమలూరు 5) మైలవరం 6) అవనిగడ్డ 7) మచిలీపట్నం 8) పెడన
వైసీపీ ఇక్కడ 5 స్థానాల్లో విజయం సాధిస్తోంది. అవి 1) గన్నవరం 2) పామర్రు 3) గుడివాడ 4) తిరువూరు 5) నూజీవీడు
ఇక విజయవాడ వెస్ట్ , కైకలూరు , నందిగామలలో తీవ్ర పోటీ నెలకొంది.
7) గుంటూరు జిల్లా : మొత్తం 17 స్థానాలు
టీడీపీ ఇక్కడ 8 స్థానాల్లో విజయం సాధిస్తోంది. అవి 1) పొన్నూరు 2) వేమూరు 3) తాడికొండ 4) చిలకలూరి పేట 5) రేపల్లె 6) మంగళగిరి 7) వినుకొండ 8) బాపట్ల
వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధిస్తోంది. అవి 1) గుంటూరు ఈస్ట్ 2) మాచర్ల 3) పత్తిపాడు 4) పెదకూరపాడు 5) తెనాలి 6) నర్సారావు పేట
ఇక మిగిలిన గుంటూరు వెస్ట్, గురజాల , సత్తెనపల్లి స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది.
8) ప్రకాశం జిల్లా : మొత్తం 12 స్థానాలు
టీడీపీ 6 స్థానాల్లో విజయం సాధిస్తోంది. అవి 1) ఒంగోలు 2) కనిగిరి 3) కొండెపి 4) పరుచూరు 5) అద్దంకి 6) సంతనూతల పాడు
వైసీపీ ఇక్కడ 5 స్థానాల్లో విజయం సాధిస్తోంది . అవి 1) మార్కాపురం 2) ఎర్రగొండపాలెం 3) గిద్దలూరు 4) కందుకూరు 5) దర్శి
ఇక చీరాల స్థానంలో తీవ్ర పోటీ నెలకొంది.
9) నెల్లూరు జిల్లా : మొత్తం 10 స్థానాలు
టీడీపీ ఇక్కడ 5 స్థానాల్లో విజయం సాధిస్తోంది. అవి 1) నెల్లూరు సిటీ 2) నెల్లూరు రూరల్ 3) ఉదయగిరి 4) వేంకటగిరి 5) కావలి
వైసీపీ ఇక్కడ 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తోంది. 1) ఆత్మకూరు 2) సర్వేపల్లి
ఇక మిగిలిన మూడు స్థానాలు గూడూరు , సూళ్లూరు పేట , కొవ్వూరు లలో తీవ్ర పోటీ నెలకొంది.
10) చిత్తూర్ జిల్లా : మొత్తం 14 స్థానాలు
టీడీపీ ఇక్కడ 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తోంది అవి 1) మదనపల్లి 2) కుప్పం 3) నగరి 4) పలమనేరు
వైసీపీ ఇక్కడ అత్యధికంగా 8 స్థానాల్లో విజయం సాధిస్తోంది. అవి 1) తిరుపతి 2) GD నెల్లూరు 3) పూతలపట్టు 4) పుంగనూరు 5) సత్యవేడు 6) చంద్రగిరి 7 ) చిత్తూర్ 8 ) తంబళ్లపల్లి
ఇక పీలేరు , శ్రీకాళహస్తి స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ కొనసాగనుంది.
11) కడప జిల్లా : మొత్తం స్థానాలు 10
టీడీపీ ఇక్కడ 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తోంది. అవి 1) మైదుకూరు 2) ప్రొద్దుటూరు
ఇక వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధిస్తోంది. అవి 1) కడప 2) పులివెందుల 3) జమ్మలమడుగు 4) రాయచోటి 5) బద్వేలు 6) కోడూరు
ఇక మిగిలిన 2 స్థానాలు రాజంపేట , కమలాపురం లలో నువ్వా నేనా అన్నట్లుగా ఉంది పరిస్థితి.
12) అనంతపురం జిల్లా : మొత్తం స్థానాలు 14
టీడీపీ ఇక్కడ 7 స్థానాల్లో విజయం సాధిస్తోంది. అవి 1) అనంతపూర్ 2) కదిరి 3) హిందూపురం 4) తాడిపత్రి 5) కళ్యాణదుర్గం 6) పెనుగొండ 7) ఉరవకొండ
ఇక వైసీపీ కూడా 6 స్థానాల్లో విజయం సాధిస్తోంది. అవి 1) రాప్తాడు 2) గుంతకల్ 3) పుట్టపర్తి 4) ధర్మవరం 5) రాయదుర్గం 6) మడకశిర
ఇక మిగిలిన శింగనమల స్థానంలో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది.
13) కర్నూల్ జిల్లా : మొత్తం స్థానాలు 14
టీడీపీ ఇక్కడ 7 స్థానాల్లో విజయం సాధిస్తోంది. అవి 1) శ్రీశైలం 2) కొడుమూరు 3) మంత్రాలయం 4) బనగానే పల్లి 5) ఆలూరు 6) ఆదోని , 7) పత్తికొండ
వైసీపీ కూడా ఇక్కడ 7 స్థానాల్లో విజయం సాధిస్తోంది. అవి 1) నందికొట్కూరు 2) పాణ్యం 3) ఎమ్మిగనూరు 4) డోన్ 5) ఆళ్లగడ్డ 6) కర్నూల్ 7) నంద్యాల
మొత్తంగా తెలుగుదేశం పార్టీ 78 నుండి 90 స్థానాల్లో విజయం సాధిస్తుండగా వైసీపీ 63 స్థానాల నుండి 75 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. ఇక జనసేన కూడా 7 స్థానాల్లో విజయం సాధిస్తోంది. దాంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో 88 స్థానాలు దక్కించుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయోచ్చు. ఆ అవకాశం అయితే ఈ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీని వరిస్తోంది.