Lord Ganesha : తంజావూరు జిల్లాలో పట్టు కోటై అనే ఊరిలో శ్రీ పురాతన వన ఈశ్వర్ స్వామి అనే పురాతన ఆలయం ఉంది. ఆ ఆలయంలోని అమ్మవారి గుడికి కుడి పక్కన ఉన్న వినాయకుని మందిరంలో అద్భుతం జరుగుతోంది. దీంతో భక్తులు ఆ ఆలయానికి పోటెత్తారు.
ఆ గుడిలోని వినాయకుని మనం ప్రార్థించిన తర్వాత ఆయన చెవిలో పూలు పెడితే, వినాయకుని ఎడమ చెవిలోని పువ్వు లోపలికి వెళుతుంది. అంటే వినాయకుడు మన ప్రార్థనలు విన్నట్టన్నమాట. దీంతో భక్తులు భారీ సంఖ్యలో ఆలయంలోని వినాయకుని దర్శించుకొని చెవులలో పూలు పెడుతూ తమ కోరికలను చెప్పుకుంటున్నారు.