హైదరాబాద్ మహానగరంలో కలకలం చెలరేగింది. జూబ్లీహిల్స్ లో ఓ డాక్టర్ తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. సంఘటన వివరాలలోకి వెళితే …….. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 7 లో డాక్టర్ మజారుద్దీన్ నివాసం ఉంటున్నాడు. డాక్టర్ మజార్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వియ్యంకుడు అని తెలుస్తోంది. ఇంట్లోనే గన్ తో కాల్చుకోవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ డాక్టర్ మజారుద్దీన్ మరణించాడు. డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే నిర్దారణకు వచ్చారు పోలీసులు. వియ్యంకుడి మరణంతో హుటాహుటిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆసుపత్రికి చేరుకున్నాడు.