ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను కొన్ని కార్యక్రమాలలో పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఈనెల 9 న ఈడీ విచారణకు రాలేనని, అందుకు బదులుగా ఈనెల 15 తర్వాత విచారణకు వస్తానని, అందుకు అనుమతి ఇవ్వాలని లేఖ రాసింది.
అయితే కవిత లేఖ పై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కవిత కోరినట్లుగా సమయం ఇస్తారా ? లేక అరెస్ట్ కు సిద్దమౌతారా అన్నది చూడాలి. ఈడీ కి లేఖ రాసిన కవిత సాయంత్రం వరకు ఎదురు చూసి స్పందన వచ్చి అనుమతి ఇస్తే ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద జరిగే దీక్షలో పాల్గొనాలని భావిస్తోంది. ఈరోజు సాయంత్రం తండ్రి కేసీఆర్ ను కలనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నోటీసులు రావడంతో దానిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈడీ కవితకు వెసులుబాటు కల్పిస్తుందా ? లేదా ? అన్నది మరికొద్ది గంటల్లోనే తేలనుంది.