
Modi viral Pics : 70వ దశకంలో తనకు అధికారం అప్పగించరని దేశ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ‘ఎమర్జెన్సీ’ విధించి నిరంకుశంగా పాలించారు ఇందిరాగాంధీ. ప్రధానిగా ఆమె చేసిన ఈ పెద్ద తప్పుకు తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు.
అయితే ఆ రెండు ఎంతో మంది నేతలు జైలు పాలయ్యారు. కొందరైతే మారువేశాల్లో తిరిగారు. అందులో మన ఇప్పటి ప్రధాని, అప్పటి గుజరాతీ నేత నరేంద్రమోడీ కూడా ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని అరుదైన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ఆయన వివిధ వేషధారణల్లో ప్రజాక్షేత్రంలో తిరిగేవారట.
చాలా కాలం కాషాయ వేషధారణలో స్వామీజీగా, తలపాగా ధరించిన సిక్కు వ్యక్తిగా ఆయన అవతారమెత్తారట.
ఈ గెటప్లో ఆయన సన్నిహితులు సైతం గుర్తించలేకపోయారని ‘మోదీ ఆర్కైవ్’ ట్వీట్ చేయగా.. దీనిని మోదీ షేర్ చేశారు.