- ప్రపంచ అగ్రనేతలతో సమావేశం

Japan : ప్రధాని నరేంద్ర మోదీ జీ 7 సదస్సు కోసం జపాన్ కు శుక్రవారం బయలుదేరారు. మరికాసేపట్లో ఆయనను అక్కడికి చేరుకోనున్నారు. హిరోషిమా లో జరిగే ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ప్రయాణానికి ముందు మోదీ ట్విట్టర్ లో పోస్టు చేశారు. పలు అంతర్జాతీయ సమస్యల పై ఆయన ప్రపంచ స్థాయి నేతలతో చర్చించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆరు రోజుల పర్యటనలో భాగంగా విదేశాలకు వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణు దాడిని ఎదుర్కొన్న హిరోషిమాలో కూడా ఆయన పర్యటించనున్నారు. అక్కడ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన గాంధీ మహాత్ముడి విగ్రహాన్ని అణు భూమిలో ఆవిష్కరించడం చారిత్రక ఘట్టంగా అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం జపాన్ ప్రధాని కిషిద స్వగ్రామం కూడా హిరోషిమా కావడం ఇక్కడ గమనార్హం.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా అమెరికా వేసిన అణుదాడికి గురైంది. ఇప్పటికీ హిరోషిమాలో ఆ దాడి ప్రభావం కొనసాగుతున్నది. ఆ ఘటనలో వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నాటి దాడిని ప్రపంచమంతా ఖండించింది. ప్రస్తుతం మోదీ పర్యటన నేపథ్యంలో సర్వత్రా చర్చనీయాంశమైంది. పర్యటనకు ముందు చేసిన ట్వీట్ లో పలు అంతర్జాతీయ సమస్యలపై ప్రపంచ నేతలతో చర్చించబోతున్నానని, ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనబోతున్నానని చెప్పుకొచ్చారు. ఏదేమైనా చాలా రోజల తర్వాత ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటనకు వెళ్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే మోదీకి ఆదరణ పెరుగుతున్నదనే వార్తల నేపథ్యంలో ఈ పర్యటన మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.