మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్,టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యా జికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’. నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేప థ్యంలో ఈ మూవీ నుంచి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మిస్టర్ బచ్చన్’ తదుపరి షెడ్యూల్ ఫిక్స్ అయింది. దీనికోసం బచ్చన్ టీం కేరళలోని కరైకుడికి బయలుదేరింది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది.
Breaking News