100 feet NTR statue Video : తెలుగు వారు అంటే గుర్తచ్చే మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన రాజసం, ఉచ్ఛారణ, నటనే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఎంతో మంది గుండెల్లో నిండిపోయారు. ఆయన శక జయంత్యుత్సవాలు మొన్ననే నిర్వహించినా తెలుగు వారితో పాటు వివిధ దేశాల్లోకి తెలుగు వారు కూడా వీటిలో వర్చువల్ గా పాల్గొన్నారు. ఆ మహనీయుడినిన స్మరించుకోవడం అంటే అదృష్టమనే చెప్పాలి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. రోజులు, వారాలు, నెలలు చెప్పుకున్నా ఆ మహానుభావుడి గురించి ఇంకా మిగిలే ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.
అయితే తానా (TANA) అమెరికాలోని ఫిలిడిఫిలియాలో నిర్వహించిన వేడుకల్లో ఎన్టీఆర్ 100 శక జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఇందులో ఆయన గురించి ప్రముఖులు మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి స్టార్ హీరోలు కూడా మాట్లాడారు. వారేమన్నారంటే.. చంద్రబాబు మాట్లాడుతూ ‘తెలుగు జాతి స్ఫూర్తి ఎన్టీ రామారావు. తెలుగు వారు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారు.
తెలుగు హెరిటేజ్ డేను అమెరికా ఎన్టీఆర్ బర్త్ డే రోజున డిక్లర్ చేశారంటే అది తెలుగు జాతికి ఎన్టీఆర్ తెచ్చిన గుర్తింపు. ఆ విషయం మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.’ అన్నారు. తర్వాత రజనీకాంత్ మాట్లాడుతూ ‘తెరమీద చూసిన ఎన్టీఆర్ ను నిజంగా చూశాను. లవ కుశ సినిమా బెంగళూర్ లో మినర్వా థియేటర్ లో ఆడింది. అది తెలుగు వారి థియేటర్. అక్కడ అన్నీ తెలుగు సినిమాలే ఆడుతాయి. అప్పుడు నా వయస్సు 13 సంవత్సరాలు థియేటర్ లోనే ఆయనను చూసింది అప్పుడే.’ అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ‘ప్రపంచంలోని తెలుగు వారి హృదయాలను గెలుచుకున్న నాయకుడు ఎన్టీఆర్. సినిమాల్లో రాముడు, కృష్ణుడు, రావణుడు పాత్రల్లో నటించారు. తర్వాత రాజకీయాల్లో చేరినా అక్కడ కూడా నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచారు.’ అన్నారు. ఈయనతో పాటు మరింత మంది ప్రముఖులు ఆయన గొప్ప తనాన్ని పొగిడారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాడున్నా తను చెప్పే మొదటి మాట ఎన్టీఆర్, తనకు గుర్తుకు వచ్చే ఆత్మాభిమానం ఎన్టీఆర్, తను తలుచుకునే తెలుగుతేజం ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచరణం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం’ అన్నారు. వెంకటేశ్ మాట్లాడుతూ ‘నేను తెలుగువాడిని అని చెప్పే గర్వంలో ఉండేది ఎన్టీఆర్’, అన్నారు. రాం చరణ్ మాట్లాడుతూ ‘తెలుగు వారికి గుర్తింపు ఇచ్చిన వ్యక్తి దగ్రేట్ నందమూరి తారక రామారావు’ అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ ‘రాముడు, కృష్ణుడు పేర్లు గుర్తుకు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ గుర్తుకు వచ్చే ఫేస్ ఎన్టీఆర్ గారే’ అన్నారు.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, వెంకటేశ్ ఇలా చాలా మంది నటులు, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ ను గుర్తుకు చేసుకున్నారు. రాబోయే సంవత్సరం (2024) ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం రూపొందించి భారత జాతికి అంకితం చేస్తామని తానా కమిటీ నిర్ణయించినట్లు వక్తలు తెలిపారు.