Nara Lokesh Sensational Tweet : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రోజురోజుకూ ఏపీలో ఉద్రిక్తతలకు కారణమవుతున్నది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అభియోగాలు మోపుతూ తమ అధినేత ను ఏపీ సీఐడీ అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ టీడీపీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో ఏపీ సీఐడీ వ్యవహారశైలి కూడా ఆది నుంచి అనుమానాలకు తావిస్తున్నది. చంద్రబాబు అరెస్ట్, తరువాత పరిణామాలు వారి తీరు ఇందుకు కారణంగా నిలుస్తున్నది.
అయితే తన తండ్రి, పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఢిల్లీ లో మకాం వేశారు. పలువురు న్యాయవాదులతో పాటు వివిధ పార్టీల జాతీయ నాయకులను కలుస్తున్నారు. అయితే ఈ క్రమంలో గురువారం ఆయన ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇందులో ఏముందంటే.. ‘సైకో జగన్ ప్రభుత్వం మా అధినేత చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించింది.. జైలులోనే అంతం చేసేందుకేనని అనుమానం బలపడుతోంది.
ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నది. జెడ్‍ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకు జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర చేస్తున్నది. చంద్రబాబుకు జైలులో భద్రత లేదు. విపరీతంగా దోమలు కుడుతున్నాయన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీతో మరణించాడు. బాబు గారికి ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబుకి ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత అంటూ ఇందులో లోకేశ్ ట్వీట్ చేశారు.
అయితే మొదటి నుంచి చంద్రబాబు అరెస్ట్ వెనుక ఏపీ ప్రభుత్వ పెద్దలపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సీఎం జగన్ స్వయంగా దీని వెనుక ఉన్నారని టీడీపీ ఆరోపిస్తున్నది. కక్షసాధింపు ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏదేమైనా టీడీపీని వీక్ చేసి, ఎన్నికల ముందు మానసికంగా దెబ్బకొట్టాలనే ప్రయత్నం ఇందులో కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక టీడీపీ యువనేత లోకేశ్ ట్వీట్ రాష్ర్ట రాజకీయాల్లో సంచలనంగా మారింది.
సైకో జగన్ @ncbn గారిని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు… pic.twitter.com/20a8Hq0Dl9
— Lokesh Nara (@naralokesh) September 21, 2023