
Obama : రష్యా-అమెరికా మధ్య వార్ కొనసాగుతూనే ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా అమెరికా రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించిన ప్రపంచంలోని చాలా దేశాలకు రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని సూచించింది. ఈ మధ్య కూడా యూఎస్ రష్యాపై మరో సారి విరుచుకుపడింది. మరిన్ని ఆంక్షలు విధించింది. అమెరికా చర్యలను రష్యా చాలా తీవ్రంగా పరిగణించింది. తమను అమెరికా ఎప్పుడూ శత్రువులా చూస్తుందని మండిపడింది.
అమెరికా ఆంక్షలను నిరసిస్తూ ఆ దేశానికి వ్యతిరేకంగా రష్యా శుక్రవారం (మే 19) సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యాలోకి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సహా 500 మంది అమెరికన్లను నిషేదించింది. ‘బైడెన్ ప్రభుత్వం రష్యాపై ఎప్పుడూ ఆంక్షలు విధిస్తుందని దీనికి ప్రతి స్పందనగా 500 మంది అమెరికన్లకు రష్యన్ ఫెడరేరషన్ లోకి ప్రవేశం నిషేధించాం’ అని రష్యా విదేశాంగా మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ జాబితాలో మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ఉన్నారని ఏఎఫ్‌పీ తెలిపింది.
ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది. అందులో భాగంగా రష్యాలోని చాలా కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. ‘రష్యాకు వ్యతిరేకంగా ఏమి చేయలేమని వాషింగ్టన్ చాలా కాలం క్రితమే నేర్చుకుని ఉండాలి’ అని ఏఎఫ్‌పీ ఉటంకిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాలో ప్రవేశానికి నిషేధించిన వారిలో టెలివిజన్ హోస్ట్ లుస్టీఫెన్ కోల్బర్ట్, జిమ్మీ కిమ్మెల్ మరియు సేత్ మేయర్స్ ఉన్నారు. సీఎన్ఎస్ యాంకర్ ఎరిన్ బర్నెట్, ఎంఎస్ఎన్‌బీసీ అధినేత రాచెల్ మాడో మరియు జో స్కార్‌బరో కూడా ఉన్నారు.
సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు ‘రసోఫోబిక్ వైఖరులు, నకిలీల వ్యాప్తిలో పాలుపంచుకున్న’ థింక్ ట్యాంకుల సభ్యులను మరియు ‘ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేసే’ కంపెనీల అధిపతులను బ్లాక్ లిస్ట్ చేసినట్లు రష్యా తెలిపింది. అదే ప్రకటనలో, గూఢచర్యం ఆరోపణలపై మార్చిలో అరెస్టయిన యూఎస్ జర్నలిస్ట్ ఇవాన్ గెర్ష్‌కోవిచ్‌కు కాన్సులర్ పర్యటనను తిరస్కరించినట్లు రష్యా తెలిపింది. ఏప్రిల్‌లో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో కలిసి ఐక్యరాజ్యసమితికి వెళ్లే జర్నలిస్టులకు వీసాలు ఇవ్వడానికి వాషింగ్టన్ నిరాకరించడంతో ఈ తిరస్కరణ ప్రేరేపించబడింది.