NTR’s Chief Security Officer: శక పురుషుడు నందమూరి తారక రామారావు గురించి తరతరాలు తెలుసుకోవలసిందే. ఆయన జీవితం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ప్రతీ విషయంలో క్రమ శిక్షణగా ఉండేవారు. సమయాన్ని (టైం) చూసి ఆయన వ్యవహరించే వారు కాదు.. ఆయనను చూసి సమయం నడుచుకునేంతలా ఆయన క్రమశిక్షణగా ఉన్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఆయనను ఫాలో అయ్యే వారి సంఖ్య అప్పటి నుంచి ఇప్పటికీ ఉందంటే అతిశయోక్తి కాదు. కేవలం అన్నగారి నోటి మాట వెంట ఎన్నో పనులు జరిగేవి. ఇప్పటికీ కొన్ని జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
ఆయన సీఎంగా ఉన్న కాలంలో పని చేసిన వారు చాలా మంది ఆయన గురించి కథలు, కథలుగా చెప్తుంటారు. ప్రతీ విషయంలో ఆయన వ్యవహరించే తీరు. ఆయన గొప్పతనం, ఆయన చూపే ప్రేమ, ఆధరాభిమానాలు ఇలా ప్రతీ ఒక్కటి అద్భుతమనే చెప్పాలి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఆయనతో పాటు పని చేసిన యంగ్ పొలిటీషియన్లు, యంగ్ ఆఫీసర్స్ ఇప్పుడు వృద్ధాప్యంలోకి చేరి మరణిస్తున్నారు. అందులో ఒకరు ఆయన చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ రాజు.
నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం, జాడీ జమాల్‌పూర్ విలేజ్ కు చెందిన మాజీ పోలీస్ ఆఫీసర్ పీఎల్ రాజు (దివంగత ఎన్టీఆర్ ఛీఫ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేశారు) ఈ ఉదయం హైదరాబాద్ లో మరణించారు. ఆయన కూడా చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ గురించి చెప్పుకచ్చే వారు. నందమూరి అంటే ఒక పేరు కాదని ఒక బ్రాండ్ అని, ఆయనకు అంగరక్షకుడిగా పని చేయడం తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.