Home BREAKING Chevireddy : ఒంగోలు ఎంపి బరిలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి..కారణం అదేనా ? జగన్ వ్యూహం...

Chevireddy : ఒంగోలు ఎంపి బరిలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి..కారణం అదేనా ? జగన్ వ్యూహం ఏంటి ?

25

 

Chevireddy Bhaskar Reddy : ఒంగోలు వైసీపీ రాజకీయం… ఇక నుంచి ముఖ్యమంత్రి జగన్‌కు నమ్మి నబంటు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేతుల్లోకి వెళ్లనుంది. తన సిట్టింగ్‌ స్థానం ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి తన కుమారుడికి టికెట్‌ ఇప్పించుకోగలిగిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి.. ఊహించని రీతిలో ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కింది.  ఓంగోలు ఎంపీ అభ్యర్థిగా భాస్కరెడ్డి పేరును  వైసీపి అధిష్టానం ఫైనల్ చేసింది.

సీఎం జగన్‌కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నమ్మిన బంటు. సీఎం కుటుంబ సభ్యులతోనూ చెవిరెడ్డికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుంగు శిష్యుడైన చెవిరెడ్డి, వైఎస్‌ మరణం తర్వాత జగన్‌కు చేరువయ్యారు. చంద్రగిరిని తన అడ్డాగా మార్చుకున్నారు. సీనియర్‌ నేత గల్లా అరుణకుమారిని ఓడించడం ద్వారా చెవిరెడ్డి సీఎం జగన్ దృష్టిలో పడ్డారు. 2014లో తొలిసారి చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అప్పటి ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. 2014-19 మధ్య చెవిరెడ్డిపై లెక్కకు మిక్కిలిగా పోలీసు కేసులు నమోదయ్యాయంటే.. ఆయన ఏ స్థాయిలో టార్గెట్‌ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.