37.8 C
India
Friday, May 15, 2026
More

    Operation Sindoor : ఆపరేషన్ సింధుర్: పాకిస్తాన్‌పై భారత్ మెరుపుదాడి, ఉగ్రవాదుల హతం

    Date:

    Operation Sindoor : పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడి నిర్వహించింది. ‘ఆపరేషన్ సింధుర్’ పేరిట మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో దాదాపు 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.

    బహవల్పూర్‌లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌కు చెందిన హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్‌కు చెందిన మదర్సాలే లక్ష్యంగా భారత ఆర్మీ ఈ మెరుపుదాడి చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. దాడుల అనంతరం అక్కడ 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా కూడా ధృవీకరించినట్లు సమాచారం.

    పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (PoK)లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఈ దాడులు చేసింది. ఈ దాడులు పూర్తి కచ్చితత్వంతో జరిగినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. అయితే, పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది.

    ప్రభుత్వ ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ కూడా స్పందించింది. తమ అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో “న్యాయం జరిగింది” (#JusticeHasBeenDelivered) అని పోస్ట్ చేసింది.

    మరోవైపు, భారత దాడులను పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది. అయితే, దాడుల్లో ముగ్గురు మరణించారని, 12 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ పేర్కొంది. భారత మీడియాలో వస్తున్న ఉగ్రవాదుల సంఖ్యపై పాక్ భిన్నమైన ప్రకటన చేసింది. తాజా పరిణామాలతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    G7 countries : పాకిస్తాన్‌కు మరో దెబ్బ..జీ7 దేశాల కీలక ప్రకటన..

    G7 countries : జీ7 దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాయి. అమెరికా, కెనడా,...

    Murali Nayak : జమ్మూకశ్మీర్‌లో అమరుడైన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళీనాయక్‌ – దేశమంతా శోకసంద్రం

    Murali Nayak : శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు...

    Karachi Port : కరాచీ పోర్టు ధ్వంసం.. ఇక పాక్ పని అయిపోయినట్లేనా?

    Karachi Port : కరాచీ పోర్టుపై భారత త్రివిధ దళాల మెరుపు దాడులతో...

    India counterattack : పాకిస్తాన్ దాడి.. భారత్ ప్రతిదాడి.. పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ధ్వంసం

    India counterattack : పాహల్గామ్ దాడి తర్వాత, భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో...