
Gully games : మనం చిన్నప్పుడు గల్లీ ఆటలు ఆడేవాళ్లం. అందులో భలే మజా ఉండేది. కోతి కొమ్మెచ్చి, తొక్కుడు బిళ్ల, దొంగాట ఇలా పలు రకాల ఆటలు ఆడేవారం. ఆడుతున్నంత సేపు చెమట పట్టేది. ఆనందంతో గంతులు వేసే వాళ్లం. దీంతో మనకు ఎలాంటి రోగాలు వచ్చేవి కావు. ఆరోగ్యంతో ఉండేవాళ్లం. ఆట ఆడితే అందులో లీనమై పోతుండే పరిస్థితి ఉండేది. ఇలా మనం ఆడే ఆటలే మన ఆరోగ్యానికి రక్షణగా ఉండేవి. ప్రస్తుతం ఆ ఆటలు కనుమరుగైపోయాయి. ఎక్కడ కూడా అలాంటి ఆటలు కనిపించడం లేదు.
ప్రస్తుతం పిల్లలు ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఇంట్లో కూర్చుని యుట్యూబ్ చూడటమే అలవాటు చేసుకుంటున్నాం. దీంతో ఊబకాయం, అధిక బరువు ఇబ్బందులు కలిగిస్తోంది. ఆహారాల్లో కూడా మన పద్ధతులు మారాయి. బేకరీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కష్టాలు కొనితెచ్చుకోవాల్సి వస్తోంది. అయినా మనం లెక్క చేయడం లేదు. మన నిర్లక్ష్యమే మనకు హాని తెస్తోంది.
పూర్వకాలంలో చెరువుల్లో, బావుల్లో ఈతలు కొట్టే వారు. ఇప్పుడు దాన్ని కూడా వదిలేశారు. అన్ని విషయాలు మరచిపోయారు. ఇళ్లకే పరిమితమవుతున్నారు. క్రికెట్ వెలుగులోకి వచ్చాక దాన్ని కూడా అప్పుడప్పుడు ఆడేవారు. ప్రస్తుతం దాన్ని కూడా మానేశారు. ఇలా మన ఆటలు అన్ని తెరమరుగు కావడం గమనార్హం.
మన గల్లీ ఆటలు ఒలింపిక్స్ కు ఏమాత్రం తీసిపోవు. మన ఆటల్లో కూడా అంతటి మహత్తర శక్తి ఉంది. మన ఆటలు మనకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మంచి శక్తిని కలుగజేస్తాయి. దీంతో ఆటలు ఆడటం వల్ల వ్యాయామం చేసిన శక్తి లభిస్తుంది. ఇలా మనకు ఆటలు మానసిక ఉల్లాసం, మనసు దృఢంగా మారే అవకాశం కల్పిస్తాయి. దీంతో ఆటలు ఆడటం మంచిదే.






