18.9 C
India
Friday, February 14, 2025
More

    Parliament Budget: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు.. 19 బిల్లులకు ఆమోదం?

    Date:

     

    నేటి నుంచి డిల్లీ లో  పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి స మావేశాలు కానుండగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవే శపెట్టనున్నారు. ఈ ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మధ్యం తర బడ్జె ట్‌ను ప్రవేశపెట్టనుంది. బుధవారం ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దే శించి ప్రసంగిస్తారు.

    గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ప్రస్తుత లోక్‌సభకు చివరి సమావేశాలు కావడంతో సుహృద్భావ వాతావరణంలో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుత స మావేశాల్లో 19 బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 146 ఎంపీలను సస్పెండ్‌ చేయగా వారిలో 132 మందిపై దీన్ని ఆ సెషన్‌ వరకే పరిమితం చేశారు. మిగతా 14 మందిలో 11 మంది రాజ్యసభ సభ్యులు, ముగ్గురు లోక్‌సభ సభ్యులున్నారు. ఈ 14 మంది సభ్యుల కేసును ఉభయసభల ప్రివిలేజ్‌ కమిటీలకు పంపారు. జనవరి 12న లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ ముగ్గురు లోక్‌సభ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.

    రాజ్యసభకు చెందిన ప్రివిలేజ్‌ కమిటీ మంగళవారం 11 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మరో వైపు.. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతి సమస్యపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయా పార్టీల ఫ్లోర్‌ లీడర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన పార్ల మెం టరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్‌ జోషి ఈ మేరకు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత సమావేశాల్లో మో దీ ప్రభుత్వాన్ని పార్లమెంటు భద్రత, మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వ రద్దు అంశంపై నిలదీసిన ప్రతి పక్ష కూటమి ఈసారి ఉమ్మడి కార్యాచరణను ఇప్పటివరకూ ప్రకటించలేదు.

    Share post:

    More like this
    Related

    KCR : 19న ఫామ్‌హౌస్ నుంచి బయటకు కేసీఆర్ !

    KCR : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో...

    Jagan : కేడర్ కోసం జగన్ కీలక నిర్ణయం – ఇక నుంచి..!!

    Jagan : మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధికారంలో...

    Ublood : శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వార్షికోత్సవం.. అతిథిగా సీతక్క.. యూబ్లడ్ యాప్ పోస్టర్స్ ఆవిష్కరణ

    Ublood : ప్రతిభను ప్రోత్సహిస్తూ, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ విశేష సేవలందిస్తున్న శ్రీనివాస...

    Bird flu : ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ.. ఓ వ్యక్తికి పాజిటివ్!

    Bird flu : ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ తీవ్ర కలకలం సృష్టిస్తోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Parliament : పార్లమెంట్ లో ఈ సీటు మిస్టరీ.. ఆ సీటును ఎందుకు దాచేశారంటే?

    Parliament : పార్లమెంట్ లో ఓ సీటును దాచేశారు. భారతీయులు ఎవరికీ తెలియని...

    Modi Vs Rahul Gandhi : మోడీ – రాహుల్ మధ్యన ‘మత’ రాజకీయం..

    Modi Vs Rahul Gandhi : నేడు దేశంలో రాజకీయాలు గమ్మత్తుగా...

    Sonia Gandhi : ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ అధ్యక్షు రాలు సోనియాగాంధీ..

    Sonia Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ రాజ్యసభ స...