నటి పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని , అలాగే అసభ్యకరమైన రీతిలో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని …… అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. పవిత్ర లోకేష్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వెళ్ళిపోయింది.
గతకొంత కాలంగా సోషల్ మీడియాలో పవిత్ర లోకేష్ – నరేష్ ల ఫోటోలతో అలాగే వీడియోలతో పలు వీడియోలు చేస్తున్నారు కొంతమంది. అంతేకాదు పలు వెబ్ సైట్ లలో అలాగే యూట్యూబ్ ఛానల్ లలో పెద్ద ఎత్తున కథనాలు రాస్తున్నారు. ఇక కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అయితే మరీ దారుణంగా అసభ్యకరమైన రీతిలో వీడియోలు చేస్తున్నారట. అవి సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.
ఇక ఇటీవల కృష్ణ మరణించిన సమయంలో కూడా అక్కడ నరేష్ , పవిత్ర లు ఉన్నారు కదా ! ఆ వీడియోలలో కూడా సొంత పైత్యం బాగానే కురిపిస్తున్నారు. దాంతో తన ఇమేజ్ కు డ్యామేజ్ అవుతోందని భావించిన పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.