Pavitra Lokesh sensation comments casting couch : క్యాస్టింగ్ కౌచ్ అనే పదం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఇప్పటికే తరచు ఎవరో ఒకరు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై చేసే కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. క్యాస్టింగ్ కౌచ్ పేరును ఎప్పుడూ వినిపించేలా చేస్తు ఫేమస్ అవుతున్నారు.. ఈ పదాన్ని ఎవ్వరు మర్చిపోకుండా చేస్తున్నారు. అయితే తాజాగా పవిత్ర లోకేష్ ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశంపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
పవిత్ర లోకేష్.. ఈ మధ్యకాలంలో ఈమె బాగా పాపులర్ అయ్యింది.. ఇండస్ట్రీ మొత్తం పవిత్ర లోకేష్, నరేష్ నామ జపమే చేస్తున్నారు.. నరేష్ తో సహజీవనం చేస్తూ ఫేమస్ అయిపొయింది. ఈమె చాలా కాలం నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న అంతగా పాపులర్ అవలేదు. అయితే మంచి నటిగా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.
మరి తాజాగా ఈమె క్యాస్టింగ్ కౌచ్ మీద గతంలో శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను ఎత్తిచూపిస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈమె మాట్లాడుతూ ఏ ఇండస్ట్రీలో అయినా కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది.. దాని నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచించాలి.. కానీ కొంత మంది ఇండస్ట్రీలో ఛాన్సులు కోసం కమిట్ మెంట్స్ ఇచ్చేసారు.
వారేమి చిన్న పిల్లలు కాదు కదా.. వారే తప్పు చేసి మళ్ళీ ఏదో జరిగిపోయినట్టు వారే బయటకు వచ్చి కాస్టింగ్ కౌచ్ అంటూ వాదిస్తున్నారు.. నా దృష్టిలో చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు చాలా పెద్దవి.. ఇష్ట పూర్వపుకంగా కలుసుకున్నప్పుడు మళ్ళీ కాస్టింగ్ కౌచ్ అంటూ డ్రామాలు ఆడడం దేనికి వారిద్దరూ ఇష్టంతోనే ముందుకు వెళ్ళినప్పుడు వారు అనుకున్నది మళ్ళీ దక్కకపోతే గోల చేస్తుంటారు.. ఇది కరెక్ట్ కాదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.