
జనసేన ఆవిర్బావ సభలో పవన్ కళ్యాణ్ ….
అవినీతి చేస్తే మమ్మల్ని నిలదీసే పరిస్థితి మీకు కల్పిస్తాం. మాకు అధికారం ఇవ్వండి . సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారం లోకి వచ్చి మోసం చేశారు. మీ జేబులో డబ్బు ఇవ్వడం లేదు. ప్రభుత్వ సొమ్ము మీరు ధర్మకర్తలు మాత్రమే. ప్రభుత్వ సొమ్ము అంతా మాదే అని దోచుకుంటున్నారు.
ఇసుక దోచుకున్నారు. అభివృద్ధి లేదు. మీలో పరివర్తన ఎప్పుడు వస్తుంది. మద్యపానం నిషేదం అని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యం విచ్చలవిడిగా అమ్ముతుంటే ఎందుకు ప్రశ్నించారు. మద్యం డబ్బు అంతా తిరిగి మిమ్మల్ని కోనేందుకు వాడతారు. మీ విలువైన ఓటు రోజుకు అర్ద రూపాయికు అమ్ముకుంటున్నారు. చదువుకున్న యువత , అపార్ట్మెంట్ లలో ఉంటే వారు కూడా ఓట్లు అమ్మకుంటే మార్పు ఎలా వస్తుంది. అమరావతి కి అన్ని వేల ఎకరాలు వద్దని ఆనాడే చెప్పాను, మూడు వేల ఎకరాలతో ప్రారంభించమని చెప్పాను. నేడు రాజధాని లోని రాష్ట్రం గా రోడ్డున పడ్డాం .
క్రిమినల్ రాజకీయాలు పోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం రావాలి. నేను రెడ్డి కులానికి వ్యతిరేకం కాదు. అన్ని పదవులు రెడ్డు కు ఇస్తే మిగతా కులాలు ఏం అనుకోవాలి. ఒక్క కులానికి ఊడిగం చేసే విదానానికి జనసేన వ్యతిరేకం. చేయలేని పనికి నేను అబద్దం చెప్పలేను. మద్యపాన నిషేధం విషయం లో నేను నిజం చెప్పాను,
జగన్ రెడ్డి అబద్దం చెప్పి అధికారం లోకి వచ్చాడు, వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక గంజాయి పెరిగిపోయింది. దేశ వ్యాప్తంగా గంజాయి ఏపి నుంచి వెళ్తుంది. గంజాయి ని వైసిపి ఎమ్మెల్యే ప్రోత్సాహిస్తున్నారు. ఏవి యువత గంజాయి మత్తు లో సాగుతుంది. జనసేన అధికారంలోకి వస్తే గంజాయి సమూలంగా అరికడతాం. గంజాయి మాఫీయా ను తొక్కు తీసి కూర్చెబెడతాం.