
జనసేన ఆవిర్బావ సభలో పవన్ కళ్యాణ్ ….
మగతనం ఏంటో భవిష్యత్తులో చూపిస్తాం. మేం అధికారం లోకి వస్తే నోరు పారేసుకున్న ప్రతి ఒక్కరికి పన్ను కట్టిస్తాం. మేం ఎన్ని స్థానాలలో పోటీ చేయాలో మీకు చెప్పాలా. మీరు ఏ స్దానం లో ఎవరూ పోటీ చేయాలో మేం అడుగుతున్నామా. తోడలు కొట్టి వారి తోడలు చూల్చి కూర్చోబెడతాం. ఏ పార్టీ ను తిట్టిన ప్రయోజనం లేదు. మీరు మారితేనే మార్పు వస్తుంది. కులాలు దాటి ఒక్కసారి మాకు అండగా నిలబడండి.
ఒక్క సారి మారి అవకాశం ఇవ్వండి. నిమ్న కులాలు కోసం ఆలోచించి నేను . నేను పుట్టిన కాపు కులం కోసం ఎందుకు ఆలోచించను. నా కులాన్ని గౌరవిస్తాను. కాపు లకు సంఖ్య బలం ఉంది. ఇతర కులాలను దగ్గరకు తీసుకుని పెద్దన్న పాత్ర పోషించాలి. మీరు ఓట్లు వేయండి మీ కోరిక తీరుతుంది. 1964 నుంచి కాపు లు సీఎం కావాలని డిమాండ్ ఉంది. మీలో ఐక్యత లేకపోవడం వల్లే మీ కోరిక తీరడం లేదు, కాపులు అధికారంలోకి వచ్చిన బిసిలు, దళితులు, మైనారిటీ లను గుండెల్లో పెట్టుకుంటా. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. కాపులు నాకు అవసరం లేదని జగన్ రెడ్డి చెప్పిన మీరు ఓట్లు ఎలా వేశారు. కాపులు తప్పు చేసి కులం లో పుట్టిన నన్ను దూషిస్తున్నారు. కాపు లలో ఐక్యత ఉంటే మిగిలిన కులాలు మీతో నడుస్తారు.ఐక్యత లేకపోతే అరాచక శక్తులు రాజ్యమేలుతుంది.
10 ఏళ్లు పార్టీ ని నిలబెట్టాను. ఇంకా ఏం చేయాలి. రోజుకు 2 కోట్లు సంపాదించే నాకు ఇంకా డబ్బులు ఎందుకు .గ్లోబెల్ ప్రచారాలు నమ్మకండి. ఏపి గ్లోబల్ట్స్ జనసేన గురించి తప్పుగా మాట్లాడితే హీనంగా పోతారు. క్షేత్రస్దాయిలో జనసేన గెలుస్తుందనే నమ్మకం నాకు కలిగితే ఒంటరిగా పోటీ చేస్తాం. గజమాలలు కాదు. ఓట్లు వేయండి. గుండెలు బాధికోవడం కాదు. గుండెల్లో ఉన్న ఓటు వేయండి.