
Purchase of flats వాన కాలంలో చూడండి.. ఎండాకాలంలో కొనండి.. అంటూ ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.. ప్లాట్ కొనాలనుకునే వారంతా వాన కాలంలో చూసుకొని ఎండాకాలంలో కొనాలని దాని సారంశం. ఎందుకంటే ముంపు ప్రాంతమా కాదా అనేది ఇప్పుడే తెలిసిపోతుందని సెటైర్లు అందులో పేలుతున్నాయి.
ప్లాట్ ఫర్ సేల్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇలాంటి బోర్డులో కనిపిస్తున్నాయి. పత్రికలు టీవీల్లో ఇలాంటి ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. భూమి మీద పెట్టుబడి పెడితే సంపన్నులు కావచ్చని అందరూ అనుకుంటుంటారు. అతి తక్కువ కాలంలో సంపన్నులు కావొచ్చని చాలామంది అప్పులు చేసి మరి ఫ్లాట్లు, ఫామ్ ల్యాండ్స్ కొంటున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ ఫ్లాట్లు పెట్టేస్తున్నారు. కాలువలు, నదులు ముంపు ప్రాంతాలు అని తేడా లేకుండా ఎక్కడ చూసినా చదును చేయించి ఫ్లాట్లు పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి ప్లాట్లు కొన్న వారంతా ఆ తర్వాత వాన కాలంలో ముందు గురై ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా విపత్తును చూసిన వారంతా ఉండడానికి చిన్నదైనా ఒక ఇల్లు ఉండాలని భావిస్తున్నారు. మరోవైపు భూములపై పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని కూడా చాలామంది భావిస్తున్నారు. ఇదే కొందరికి అవకాశంగా మారింది. కొందరు నేతలు, అధికారుల అండదండలతో దొరికిన కాడల్లా రియల్ ఎస్టేట్ అంటూ భూములు కబ్జా చేస్తూ ఉన్నారు. వాటికి అనుమతులు లేకుండానే బోర్డులు పెడుతూ అమ్మేస్తున్నారు. పైపై మెరుగులు చూసి సామాన్యులు మోసపోతున్నారు.
అయితే తాజాగా వైరల్ అవుతున్న ఫొటో సూపర్ సెటైర్ గా మారింది. వాన కాలంలో వర్షాలు పడ్డ తర్వాత ముంపు ప్రాంతాలను చూసుకొని ఎండాకాలంలో కొనుక్కోవాలని బోర్డు పెట్టి ఉన్న ఫొటో వైరల్ అవుతున్నది. ఇది కూడా నిజమే కదా. లక్షల రూపాయలు పెట్టి కొని ప్లాటు ముంపులోకి పోతే ఇబ్బందులు మనకే కదా. సంపాదన ధ్యేయంగా కొందరు అక్రమార్కులు చేస్తున్న ఆగడాలను ఎత్తిచూపుతూ ఈ బోర్డు ప్రస్తుతం వైరల్ అవుతున్నది.






