24 C
India
Saturday, September 12, 2026
More

    PM Modi in America : అమెరికాలో మోడీ విస్తృత పర్యటన.. సాదరంగా ఆహ్వానించిన వైట్ హౌజ్..

    Date:

    PM Modi in America
    PM Modi in America

    PM Modi in America : ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ (జూన్ 21) అమెరికా పర్యటన నిర్వహించారు. జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో  దిగారు మోడీ. ప్రవాస భారతీయులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన కూడా వారిని అంతే ఘనంగా విష్ చేశారు. కరచాలనం కూడా చేశారు. వారిలో ఎడిసన్ మేయర్ సామ్ జోషితో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు ఉన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో.. అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు భారత ప్రధాని నేతృత్వం వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు న్యూయార్క్‌లో జరిగే యోగా సెషన్‌లో.. ఐరాస ఉన్నతాధికారులు, పలు దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రధాని వాషింగ్టన్‌ వెళ్తారు. 22న అమెరికా అధ్యక్షుడు బైడెన్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. అనంతరం కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి మోడీ ప్రసంగం ఉంటుంది. అదే రోజు సాయంత్రం.. బైడెన్‌ దంపతులు ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు.

    వైట్‌హౌస్ ఏం చెప్పిందంటే..

    భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ‘అమెరికా లాగా భారత్ కూడా శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం, రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించబోతున్నాయి’. అంటూ మోడీ పర్యటన నేపథ్యంలో వైట్ హౌస్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ఆహ్వానంతో ప్రధాని అమెరికాలో పర్యటిస్తున్నారు.

    గురువారం (జూన్ 22) మోదీ గౌరవార్థం జో బైడెన్ దంపతులు డిన్నర్ ఇవ్వనున్నారు. దానికి ముందు సంయుక్త సెషన్ ను ఉద్ధేశించి మోడీ ప్రసంగిస్తారు. ‘భారత్ లో శక్తివంతమైన ప్రజాస్వామ్యం ఉంది, వారు కూడా ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తారు. ఏ సమయంలోనైనా ప్రజాస్వామ్యం పరిపూర్ణతను చేరుకుంటోంది. భారత్ మరింత పరిపూర్ణంగా మారేందుకు మా మధ్య సంబంధాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రపంచంలోని రెండు శక్తి వంతమైన, ప్రభావవంతమైన ప్రజా స్వామ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాన్ని కొనసాగించబోతున్నాం’ అని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ అన్నారు.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా, ఏ నాయకుడితో మాట్లాడినా మానవ హక్కులపై ఆందోళన లేవనెత్తుతున్నారని కిర్బీ చెప్పారు. యూఎస్ తన స్నేహితులు, మిత్రదేశాలు, భాగస్వాములు, అంతగా స్నేహ పూర్వకంగా లేని దేశాల్లో కూడా మానవ హక్కుల ఆందోళనలను లేవనెత్తుతుందని కిర్బీ వివరించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Visit to America : అమెరికాలో పర్యటన.. మోదీ, రాహుల్ కు మధ్య ఉన్న తేడా ఇదే..

    Visit to America : భారత ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ...

    Modi satires : అమెరికాలోనూ తగ్గేదేలే.. మోడీ సెటైర్ వేస్తే వహ్వా అనాల్సిందే..

    Modi satires : ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ముందుగా న్యూయార్క్...

    New York Times : మోడీ ప్రపంచంలోనే ముందు వరుసలో ఉన్న నేత.. న్యూయార్క్ టైమ్స్ బిగ్ స్టోరీ..

    New York Times : ప్రధాని నరేంద్ర మోడీకి ఇండియాలోనే కాక...

    Modi counter Pakistan : పాక్ కు మోదీ కౌంటర్.. ఆమెరికా నుంచే హెచ్చరికలు

    Modi counter Pakistan : ఇక ఉగ్రవాదంపై ఉక్కుపాదం తప్పదని భారత...