Police notices Ali: సరైన అనుమతులు లేకుండా తన తండ్రి పేరుపై సర్వే నెం. 345లో నిర్మాణాలు చేపడుతున్నారని టాలీవుడ్ సీనియర్ నటుడు అలీకి వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలం, ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి నోటీసులు జారీ చేశారు. గతంలో నవంబర్ 5న నోటీసులు జారీ చేయగా నటుడు స్పందించలేదు. దీంతో నవంబర్ 22న మరోసారి నోటీసులు జారీ చేశారు. దీని ప్రచారం మూడు రోజుల్లో నిర్మాణాలకు సంబంధించి అనుమతి పత్రాలను గ్రామ పంచాయతీలో అప్పగించాలని ఆదేశించింది.
అలీకి ఎక్కమిడిలో తన తండ్రి పేరుపై సాగుకు అనువైన వ్యవసాయ భూమిని ఉంది. అక్కడ స్థానిక వ్యవసాయ కార్మికుల సాయంతో పంటలు పండించాడు. పండ్ల తోటలు పెంచాడు. విరామ సమయంలో సేద తీరేందుకు అక్కడికి వెళ్తాడని తెలిసింది. అయితే గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే ఫామ్‌హౌస్, సంబంధిత నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణల రావడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫామ్ హౌస్‌లోని కేర్ టేకర్‌కు అందజేసిన నోటీసుల్లో అనధికార నిర్మాణాలకు సంబంధించి అలీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటీసులపై నటుడు అలీ ఇంత వరకు స్పందించలేదు. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలో ఫామ్‌హౌస్‌లు కలిగి ఉన్న కొంత మంది టాలీవుడ్ సెలబ్రిటీల ట్రెండ్‌ను హైలైట్ చేస్తోంది. ఈ ప్రాపర్టీలు తరచుగా వారు సేద తీరేందుకు ఉపయోగించుకుంటున్నారు. ప్రైవేట్ సమావేశాల కోసం అప్పగిస్తున్నారు. రిలాక్సేషన్ స్పాట్లు లేదంటే సమావేశాలకు వేదికలుగా వినియోగించుకుంటున్నారు.