Policeman Mobile Chatting : స్పృహ మరియు అవగాహన అనేది మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం.. ఎవరైనా సరే పరిసరాలపై దృష్టి పెట్టకుండా మొబైల్ ఫోన్ లేదా వీడియోలపై దృష్టి పెడితే అనర్థాలు జరగక మానదు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదం బారిన పడవచ్చని పోలీసులకు ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఫైన్లు విధిస్తుంటారు.
అయితే రోడ్డుపై నడుస్తూ ఓ పోలీస్ అధికారి చుట్టూ ఉన్న పరిసరాలను మరిపోయాడు. ఇంకేముందే పక్క నుంచి వెళుతున్న ఓ ఎద్దు ఆయన్ని వెనక్కి నుంచి ఒక్కసారిగా ఎత్తిపడేసింది. ఈ ఘటన క్షణాల్లో జరిగిపోగా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఈ సీన్ మొత్తం రికార్డు అయింది.
ఆ పోలీస్ అధికారి వెంటనే మరో అధికారి లేపి పక్కకు తీసికెళ్లిపోయాడు. అయితే ఈ ఘటనలో ఆ పోలీస్ అధికారి చిన్నపాటి గాయాలతో బయటిపడినట్లు తెలుస్తోంది. అతి అదృష్టం బాగుండ బట్టే చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో ఏదైనా వెహికల్ వచ్చి ఉంటే మాత్రం అతడి పరిస్థితి మరోలా ఉండేదనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.