చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఒడియా నటుడు పింటు నందా ( 45 ) అనారోగ్యంతో మృతి చెందాడు. ఒడియా చిత్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించిన పింటు నందా గతకొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. భువనేశ్వర్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆరగ్యం మెరుగవకపోవడంతో ఢిల్లీకి తరలించారు.
అయితే అక్కడ కూడా నందా కోలుకోలేదు దాంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. కాలేయ వ్యాధి మరింత తీవ్రం కావడంతో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి బుధవారం రాత్రి హైదరాబాద్ లోనే మరణించాడు. దాంతో భువనేశ్వర్ కు పింటు నందా మృతదేహాన్ని తరలించారు కుటుంబ సభ్యులు. పింటు నందా మృతితో ఒడియా చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.