
Priyanka from Nalgonda : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనుమరాలు, ఏఐసీసీ అగ్రనేత ప్రియాకా గాంధీ చూపు తెలంగాణ వైపు పడింది. రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమె ఇప్పుడు సౌత్ పై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆమె నడుం భిగించినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సౌత్ స్టేట్ అయిన కేరళ నంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంకా గాంధీ కూడా సౌత్ స్టేట్స్ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కు మంచి పట్టున్న తెలంగాణను ఎంచుకున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యువ సంఘర్షణ సభ’ కు ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. ఈ వేదిక నుంచి యూత్ డిక్లరేషన్ ఇచ్చారు ఆమె. ఈ సభ ద్వారా ప్రియాంక బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రత్యేక రాష్ర్టం ఇస్తే కేసీఆర్ కుటుంబం ఆ ఫలాలు అనుభవిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ మనుమరాలిగా చెప్తున్నా మళ్లీ కాంగ్రెస్ వచ్చి తీరుతుందని ఆమె చెప్పిన మాటలు కాంగ్రెస్ కేడర్ లో జోష్ నింపాయి.
కర్ణాటక పోలింగ్ బుధవారం (మే 10)తో ముగుస్తుంది. ఇక ఫలితాలు 13న వెలువడుతాయి. ఫలితాలు ఈ సారి కాంగ్రెస్ కే అనుకూలంగా ఉంటాయని టాక్ వస్తున్నాయి. కర్ణాటక ప్రజా తీర్పు ఎలా ఉన్నా తెలంగాణలో మరింత పట్టు పెంచాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ లో జరుగనున్న ఎన్నికలలో ప్రచారం చేసేందుకు తెలంగాణలోనే మకాం పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో పాటు వచ్చే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ నుంచే పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇందిరా గాంధీ ఇక్కడి నుంచి గెలిచే ప్రధాని అయ్యారు. ఆమె మనుమరాలు కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తే పార్టీకి మంచి భవిష్యత్ ఉండబోవచ్చని నాయకులు భావిస్తున్నారు. ఇందు కోసం ఆమెకు నల్గొండ ఎంపీ స్థానం కేటాయించనుంది కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం. 2019లో నల్గొండ ఎంపీగా ప్రియాంక నిలబడతారని లీకులు ఇస్తున్నారు.






