
Priyanka Gandhi : కర్ణాటక ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ పార్టీ దృష్టి ఇక తెలంగాణపై పడింది. తెలంగాణను గెలుచుకునేందుకు ఇప్పటికే ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇందుకోసం అవసరమైన అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నది. రెండు తెలుగు రాష్ర్టాల సీఎంలు కేసీఆర్, జగన్ ను దెబ్బకొట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కర్ణాటకకు చెందిన కీలక నేత మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు సమాచారం.
అయితే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆమె తమతో కలిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్, కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ను రంగంలోకి దించినట్లు సమాచారం. డీకే కు షర్మిల కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. తెలంగాణను కేసీఆర్ ను దెబ్బతీయాలంటే షర్మిలతో సహా మరికొంత మందిని తమవైపు తిప్పుకోవాలని అధిష్టానం భావిస్తున్నది. ఆమె తమతో కలిసి వస్తే రెండు రాష్ర్టాల్లో ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఓటింగ్ చీలకుండా కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు సమాచారం.
తమతో కలిసి నడిస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను అప్పగించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే తనను కలవడానికి ఒకసారి ఢిల్లీ రావాలని షర్మిలను ప్రియాంక గాంధీ కోరినట్లు సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిలపై ప్రియాంకు ప్రత్యేక అభిమానం ఉందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. మరి షర్మిల ఏం నిర్ణయం తీసుకుంటారోనని అంతా భావస్తున్నారు. భవిష్యత్ లో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో కలిపేస్తారా.. లేదంటే ఒంటరిగా వెళ్తారా.. వేచి చూడాలి. మరోవైపు రెండు పార్టీల పొత్తు అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. విలీనం లేకపోతే పొత్తు కు అయినా సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.